Virat Kohli : కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం పై అనుష్క శర్మ రియాక్షన్
Virat Kohli : 14 ఏళ్లుగా భారత టెస్ట్ క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్టు ప్రకటించడం అభిమానులను కలచివేసింది. తన అద్భుత ఆటతీరు, అంకితభావంతో కోట్లాది అభిమానుల గుండెల్లో నిలిచిన విరాట్, అనేక రికార్డులు, సెంచరీలతో తనదైన ముద్రవేశాడు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పెట్టిన భావోద్వేగపూరిత పోస్ట్ అభిమానులను ఎంతగానో కలిచివేసింది.
విరాట్ తన పోస్ట్‌లో “టెస్ట్ క్రికెట్ బ్లూ డ్రస్ ధరించి 14 ఏళ్లు కావొస్తుంది. ఈ ప్రయాణం ఎన్నో నేర్పించింది, నన్ను మానసికంగా గట్టిగా తయారుచేసింది. తెల్ల దుస్తుల్లో ఆడటం నాకు ఎప్పుడూ గర్వంగా ఉండేది. కొన్ని సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉన్నాయి. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. నా సహచరులకు, అభిమానులకు నా ధన్యవాదాలు,” అంటూ ముచ్చటగా గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు తన ఆట జీవితం ఓ అద్భుతమైన ప్రయాణంగా పేర్కొన్నాడు.

Virat Kohli : కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం పై అనుష్క శర్మ రియాక్షన్
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో, ఆయన భార్య అనుష్క శర్మ స్పందన మరింత హృదయాలను తాకింది. “నీ కంటి వెనక దాచిన బాధను, నీ పోరాటాన్ని నేనే చూసాను. టెస్ట్ క్రికెట్‌పై నీకున్న ప్రేమను నేనే తెలుసు. ప్రతి సిరీస్ తర్వాత నీవు పునరుజ్జీవించి తిరిగొచ్చేవాడివి. నీ విజయాన్ని పక్కనుండి చూస్తూ గర్వించాను” అంటూ అనుష్క తన భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. విరాట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గౌరవిస్తూ “ఈ గుడ్‌బైకి నీవు అర్హుడివి” అంటూ ముగించింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కి ఇచ్చిన సేవలు భవిష్యత్తు తరాలకూ స్ఫూర్తిగా నిలవనున్నాయి.