Home » Exclusive » Chennai Super Kings Team Should Be Suspended From Ipl 2023
Exclusive

Chennai Super Kings Team : బిగ్ న్యూస్.. మళ్ళీ బ్యాన్ అవ్వబోతోన్న చెన్నై సూపర్ కింగ్స్ టీం…. వీడియో

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: April 12, 2023 6:54 pm
Advertisement

Chennai Super Kings Team : ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఐపీఎల్ గురించే చర్చ. తాజాగా తమిళనాడు అసెంబ్లీలో పీఎంకే ఎమ్మెల్యే ఐపీఎల్ గురించి చర్చ లేవనెత్తారు. చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టుపై నిషేధం విధించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తమిళనాడుకు చెందిన ఆటగాళ్లు ఎవరూ లేరు. కానీ.. తమను తాము తమిళనాడు జట్టుగా మార్చుకున్నారని.. అందుకే ఆ జట్టుపై నిషేధం విధించాలంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని పీఎంకే ఎమ్మెల్యే వెంకటేశ్వరన్ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తమిళనాడు రాష్ట్రంలో చాలామంది అత్యుత్తమమైన క్రికెటర్లు ఉన్నారు. కానీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒక్క తమిళనాడుకు చెందిన ప్లేయర్ కూడా లేడు. తమిళనాడు టీమ్ అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ.. అందులో ఒక్క తమిళనాడు ప్లేయర్ లేడు. తమిళనాడు టీమ్ పేరుతో మన దగ్గర్నుంచి బాగానే లాభాలు పొందుతున్నారు అంటూ ఆయన అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.

Advertisement

 

Advertisement

Chennai Super Kings Team : ఐపీఎల్ టికెట్లు కావాలంటూ రచ్చ చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

మరోవైపు తమకు ఐపీఎల్ టికెట్స్ కావాలంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. చెన్నైలో జరుగుతున్న మ్యాచ్ ల టికెట్స్ కావాలని వాళ్లు డిమాండ్ చేశారు. అసలు అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి కాకుండా.. ఈ ఐపీఎల్ మ్యాచ్ ల గురించి గొడవ ఏంట్రా బాబు అంటూ తమిళనాడు ప్రజలు తలగోక్కుంటున్నారు. ఒకరేమో చెన్నై జట్టును బ్యాన్ చేయాలని, మరొకరేమో ఐపీఎల్ మ్యాచ్ ల టికెట్స్ కావాలని డిమాండ్ చేయడంతో అసెంబ్లీలో ఒక్కసారిగా అందరు ఎమ్మెల్యేలు నివ్వెరపోయారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి