Home » Entertainment » Cricketer David Warner In Pushpa 2 Movie
Entertainment

David Warner : బిగ్ న్యూస్ : పుష్ప 2 లో క్రికెటర్ డేవిడ్ వార్నర్..!!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 22, 2023, 8:00 pm
Advertisement

David Warner : క్రికెట్ ప్రపంచంలో డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే డేవిడ్ వార్నర్ మైదానంలో ఎంత సీరియస్ గా ఆడతాడో మైదానం వెలుపల చాలా సరదాగా నవ్వుతూ మాట్లాడుతాడు. ఇక డేవిడ్ ఎక్కువగా సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటాడు. ఇంస్టాగ్రామ్ ద్వారా డేవిడ్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా డేవిడ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని పాటలను, డైలాగులను స్పూఫ్ చేసేవాడు. దీంతో ఆయన వీడియోలకు ఫుల్ ఫాలోయింగ్ ఏర్పడింది. బాలీవుడ్ సహా తెలుగు పాటలకు కూడా వార్నర్ డాన్సులు చేస్తూ అలరిస్తున్నాడు.

Advertisement

Cricketer David Warner in Pushpa 2 Movie

భారీ బ్లాక్ బస్టర్ సినిమాల నుండి పాపులర్ డైలాగులను వినిపించాడు.దీంతో అతను భారతీయ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. 2021 లో విడుదలైన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప సినిమాలోని పాటలను డైలాగులపై అనేక వీడియోలు రూపొందించి వేవ్స్ క్రియేట్ చేశాడు. తాజాగా డెవిడ్ పుష్ప 2 సినిమా పోస్టర్ లో తన ముఖాన్ని మార్కింగ్ చేసి విడుదల చేశాడు. దీంతో మరోసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు. అయితే ఇప్పుడు వార్నర్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజంగానే ఈ సినిమాలో నటిస్తున్నారా అని అడిగితే దానికి చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు.

Advertisement

వార్నర్ మొదట చిరునవ్వులు చిందించాడు. తర్వాత నటులను నటించనివ్వమని సూచించాడు. పుష్ప 2 లో మిమ్మల్ని అతిధి పాత్రలో చూడాలి అని అడగగా అవును నటీనటులకు చాన్స్ ఇవ్వండి అంటూ నవ్వుతూ చెప్పాడు. అంతకుముందు ఇంటర్వ్యూలో మహేష్ బాబు, అల్లు అర్జున్, రష్మిక లాంటి స్టార్స్ తో నటించాలని ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే సినిమాలో విలన్ గా నటించాలని ఉంది అని, అది నా స్వభావం అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. మరి సుకుమార్ వార్నర్ కోసం పుష్ప సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ఇస్తాడో లేదో చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి