danish kaneria blamed bcci decision on virat kohli
Virat Kohli : విరాట్ కోహ్లీ.. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ పేరు చెబితే పూనకాలే. తన పర్మార్మెన్స్‌తో కోట్ల మంది అభిమానులకు సంపాదించుకన్నాడు కోహ్లీ. ఇక అతడు బ్యాట్ పట్టుకుని గ్రీస్‌లోకి దిగితే ఇక బౌండరీలు బద్దలవ్వాల్సిందే. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించి పెట్టాడు. కానీ అతన్ని ఆ పదవి నుంచి తొలిగించడంపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ అనంతరం తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించిన టైంలోనే.. వన్డే, టెస్ట్ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తానంటూ స్పష్టం చేశాడు.
కానీ బీసీసీఐ మాత్రం వన్డే కెప్టెన్సీ నుంచి అతన్ని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా రియాక్ట్ అయ్యాడు. కోహ్లీని బీసీసీఐ తొలగించిన పద్దతిని తప్పుబట్టాడు. కోహ్లీకి మరింతగా గౌరవం ఇవ్వాల్సిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.బీసీసీఐ వారు కోహ్లీకి గౌరవం ఇవ్వలేదన్నాడు కనేరియా. కోహ్లీ కెప్టెన్‌గా ఇండియాకు 65 విజయాలు అందించాడు. ఎక్కువ విజయాలు సాధించిన భారత నాల్గవ కెప్టన్‌గా స్థానం సొంతం చేసుకున్నాడు. ఆ రికార్డుల ఆధారంగా గౌరవానికి కోహ్లీ అర్హుడు.
danish kaneria blamed bcci decision on virat kohli
కెప్టెన్‌గా ఐసీసీ ట్రోఫీ గెలవకపోవచ్చు.. కానీ, అతను నడిపించిన మార్గం సాధారమైనది కాదని ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన్న ఇంటర్వ్యూలో తెలిపాడు. కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో ఓ సూపర్ స్టార్ అని కొనియాడాడు. ప్రపంచ క్రికెట్‌లో కోహ్లీ, బాబర్ ఆజా మాత్రమే సూపర్ స్టార్స్ అన్నాడు. కోహ్లీకి తెలియజేయకుండా అతన్ని బీసీసీఐ తొలగించిందని వాపోయాడు. గంగూలీ సైతం గొప్ప వ్యక్తి అని, మాజీ కెప్టెన్ సైతం అని చెప్పుకొచ్చాడు. రోహిత్ ను కెప్టెన్ గా చేయాలనుకుంటున్న విషయాన్ని కోహ్లీతో చెప్పి ఉంటే బాగుండేది. మరో వైపు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించడంపై ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.