Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సంచలనాలు సృష్టించింది. ఎన్ని చరిత్రలను తిరగరాసింది. కలెక్షన్ల సునామీలకు సైతం సృష్టించింది. నీడ మూవీతో బాల నటుడిగా వెండితెరకు పరిచయమైన మహేశ్ బాబు.. అనేక చిత్రాల్లో నటించాడు. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీతో ఆయన నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇక మురారీ మూవీ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవరసరమే లేదు. ఈ మూవీ పాటలకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తర్వాత పలు చిత్రాలు నిరాశపరిచినా..
ఒక్కడు మూవీతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ పెద్ద హిట్. 2005లో వచ్చిన అతడు మూవీ మహేశ్‌లోని మాస్ యాంగిల్‌ను చూపిస్తే.. ఆ తర్వాత వచ్చిన పోకిరి మూవీ ఇండస్ట్రీలోని రికార్డులన్నీంటినీ తిరగరాసింది. ఇక భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరూ మూవీతో హ్యట్రిక్ అందుకున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీలో బిజీగా ఉన్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రామ్‌కు వచ్చిన మహేశ్ బాబు.. ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తన అమ్మమ్మ చేతి వంటలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఆమె లేకపోవడంతో అవన్నీ మిస్ అవుతున్నానని ఫీల్ అయ్యాడు. తన అమ్మమ్మతో ఉన్న అనుబంధాన్ని చెప్పాడు. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పాడు మహేశ్ బాబు. నువ్వు కూడా బాగా తింటావ్ కదా అంటూ ఎన్టీఆర్ ను కాస్త ఆట పట్టించాడు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో సర్కారు వారి పాట మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ యూనిట్. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేశ్ ఓ మూవీ చేయబోతున్నారట. మరో వైపు ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 7వ తేదీన రిలీజ్ కానుంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.