Babar Azam – Virat Kohli : సొంత గడ్డపై పాకిస్తాన్ జట్టు చెత్త ప్రదర్శన కనబరుస్తూ విమర్శకుల చేత చీవాట్లు తింటుంది. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను కూడా బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాక్ 0-3తో వైట్‌వాష్ కావడంతో, ఈ ఏడాది సొంతగడ్డపై జరిగిన నాలుగు సీరీస్‌ల్లో ఓటమిపాలైనట్టు అయింది.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిన పాక్.. టీ20 సిరీస్‌ను కూడా కోల్పోగా, టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్‌తో ఆడిన టీ20 సిరీస్ కూడా కోల్పోయింది. ఇలా ఈ ఏడాది చెత్త ప్రదర్శన కనబరచిన పాక్ టీంపై ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. ఘోర పరాభావంపై పాకిస్థాన్ అభిమానులతో పాటు
మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడని, బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా బాబర్‌పై దారుణమైన కామెంట్స్ చేశాడు. బాబర్ ను కోహ్లీతో పోల్చడం తెలివితక్కువ పని అని.. అతడికి అంత సీన్ లేదంటూ కనేరియా విమర్శలు గుప్పించాడు. టీమిండియాలో రోహిత్, కోహ్లీలు దిగ్గజాలు అని, వారితో బాబర్ ను పోల్చి వాళ్ల స్థాయిని తగ్గించొద్దంటూ సూచనలు చేశాడు కనేరియా. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ బిగ్ జీరో అని చెప్పాలి.
టెస్టు క్రికెట్లో జట్టును ముందుకు నడిపించేంత సామర్థ్యం కూడా అతడికి లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్‌లను చూసి కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకుంటే బాగుండేది. ఇగోను పక్కనబెట్టి కెప్టెన్సీ ఎలా చేయాలో సర్ఫరాజ్ అహ్మద్‌ని అడిగిన మంచిగా ఉండేది. బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్ కు అస్సలు పనికిరాడని, అతడు ఈ ఫార్మాట్ నుంచి వీలైనంత త్వరగా తప్పుకుంటే అతడి కెరీర్ కే మంచిదని సూచనలు చేశాడు డానిష్ కనేరియా. టీమిండియా గత 10 ఏళ్లలో సొంత గడ్డ మీద 42 మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండు టెస్టుల్లో మాత్రమే ఓడింది. పాకిస్థాన్ 11 టెస్టులే ఆడినప్పటికీ నాలుగింట్లో ఓడిపోయిందిని చెప్పుకొసక్తున్నారు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.