Babar Azam – Virat Kohli : విరాట్ కోహ్లీకి, బాబ‌ర్ ఆజ‌మ్‌కి పోలిక‌నా.. పాక్ కెప్టెన్ ఓ పెద్ద జీరో అన్న పాక్ మాజీ స్పిన్న‌ర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Babar Azam – Virat Kohli : విరాట్ కోహ్లీకి, బాబ‌ర్ ఆజ‌మ్‌కి పోలిక‌నా.. పాక్ కెప్టెన్ ఓ పెద్ద జీరో అన్న పాక్ మాజీ స్పిన్న‌ర్

Babar Azam – Virat Kohli : సొంత గ‌డ్డ‌పై పాకిస్తాన్ జ‌ట్టు చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ విమ‌ర్శ‌కుల చేత చీవాట్లు తింటుంది. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను కూడా బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాక్ 0-3తో వైట్‌వాష్ కావ‌డంతో, ఈ ఏడాది సొంతగడ్డపై జ‌రిగిన నాలుగు సీరీస్‌ల్లో ఓటమిపాలైన‌ట్టు అయింది.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిన పాక్.. టీ20 సిరీస్‌ను కూడా కోల్పోగా, టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్‌తో ఆడిన టీ20 సిరీస్ కూడా కోల్పోయింది. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :21 December 2022,4:20 pm

Babar Azam – Virat Kohli : సొంత గ‌డ్డ‌పై పాకిస్తాన్ జ‌ట్టు చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ విమ‌ర్శ‌కుల చేత చీవాట్లు తింటుంది. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను కూడా బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాక్ 0-3తో వైట్‌వాష్ కావ‌డంతో, ఈ ఏడాది సొంతగడ్డపై జ‌రిగిన నాలుగు సీరీస్‌ల్లో ఓటమిపాలైన‌ట్టు అయింది.. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓడిన పాక్.. టీ20 సిరీస్‌ను కూడా కోల్పోగా, టీ20 ప్రపంచకప్ ముందు ఇంగ్లండ్‌తో ఆడిన టీ20 సిరీస్ కూడా కోల్పోయింది. ఇలా ఈ ఏడాది చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చిన పాక్ టీంపై ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు. ఘోర పరాభావంపై పాకిస్థాన్ అభిమానులతో పాటు

మాజీ క్రికెటర్లు కూడా తీవ్ర‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఎక్కువ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభావంతో బాబర్ ఆజామ్ కెప్టెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడ‌ని, బాబర్ ఆజామ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తం అవుతుంది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ క‌నేరియా బాబ‌ర్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేశాడు. బాబర్ ను కోహ్లీతో పోల్చడం తెలివితక్కువ పని అని.. అతడికి అంత సీన్ లేదంటూ కనేరియా విమర్శ‌లు గుప్పించాడు. టీమిండియాలో రోహిత్, కోహ్లీలు దిగ్గజాలు అని, వారితో బాబర్ ను పోల్చి వాళ్ల స్థాయిని తగ్గించొద్దంటూ సూచ‌న‌లు చేశాడు కనేరియా. కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ బిగ్ జీరో అని చెప్పాలి.

Danish Kaneria comments on pak captain Babar Azam And Virat Kohli

Danish Kaneria comments on pak captain Babar Azam And Virat Kohli

Babar Azam – Virat Kohli : అత‌నితో పోల్చొద్దు..!

టెస్టు క్రికెట్లో జట్టును ముందుకు నడిపించేంత‌ సామర్థ్యం కూడా అతడికి లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్‌కల్లమ్‌లను చూసి కెప్టెన్సీ ఎలా చేయాలో నేర్చుకుంటే బాగుండేది. ఇగోను పక్కనబెట్టి కెప్టెన్సీ ఎలా చేయాలో సర్ఫరాజ్ అహ్మద్‌ని అడిగిన మంచిగా ఉండేది. బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్ కు అస్స‌లు పనికిరాడని, అతడు ఈ ఫార్మాట్ నుంచి వీలైనంత త్వరగా తప్పుకుంటే అతడి కెరీర్ కే మంచిదని సూచ‌న‌లు చేశాడు డానిష్ క‌నేరియా. టీమిండియా గత 10 ఏళ్లలో సొంత గడ్డ మీద 42 మ్యాచ్‌లు ఆడ‌గా, అందులో రెండు టెస్టుల్లో మాత్రమే ఓడింది. పాకిస్థాన్ 11 టెస్టులే ఆడినప్పటికీ నాలుగింట్లో ఓడిపోయిందిని చెప్పుకొస‌క్తున్నారు.

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది