Home » National » Glenn Maxwell Marries Indian Women
National

Glenn Maxwell : ఇండియ‌న్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న మ్యాక్స్‌వెల్‌.. వివాహం ఎప్పుడో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Updated on: February 15, 2022 9:12 am
Advertisement

Glenn Maxwell : ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ గ్లెన్ మాక్స్‌వెల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. అత‌ని విధ్వంస‌ర బ్యాటింగ్‌కి బౌల‌ర్స్ గుండెల్లో ద‌డ పుట్టాల్సిందే. ఆస్ట్రేలియా టీంకి ఆల్‌రౌండ‌ర్‌గా విశేష సేవ‌లు అందిస్తున్న మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో బెంగ‌ళూరు త‌ర‌పున ఆడుతున్నాడు. అయితే త్వ‌ర‌లో ఆయ‌న ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన చిరకాల గర్ల్‌ఫ్రెండ్‌ ఎన్నారై విని రామన్‌ మెడలో ఇండియన్‌ స్టైల్‌లో మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడిచేందుకు రెడీ అవుతున్నాడు. 2022 మార్చి 27న మెల్‌బోర్న్‌లో ఈ పెళ్లి జరుగనుంది. అయితే పూర్తిగా హిందూ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరగనుంది.

Advertisement

ఈ మేరకు తమిళంలో ప్రింట్‌ చేయించిన వెడ్డింగ్‌ కార్డ్‌ నెట్టింట వైరల్‌గా మారింది.భారత సంతతికి చెందిన విని రామన్‌తో మ్యాక్స్‌వెల్ కి 2020లోనే నిశ్చితార్థం కాగా.. చాలాకాలంగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పూర్తిగా భారతీయ సంప్రదాయం ప్రకారం మెల్‌బోర్న్‌లో జరుగనున్నది. ఓ ఈవెంట్‌లో వీరిద్ద‌రు క‌లిసిన‌ట్టు స‌మాచారం. తమిళ వైష్ణవ సంప్రదాయ పద్దతిలో ఈ పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. గ‌తంలో తాను ఫామ్ కోల్పోయి జ‌ట్టుకు దూర‌మైన సంద‌ర్భాల్లో వినీ రామ‌న్ త‌న‌కు అండ‌గా నిలిచింద‌ని మాక్స్‌వెల్ ప‌లు సంద‌ర్భాల్లో తెలిపాడు.

glenn maxwell marries indian women

Advertisement

Glenn Maxwell : గుడ్ న్యూస్ చెప్పిన మ్యాక్స్

రామ‌న్ వ‌ల్ల‌నే మాన‌సిక ఒత్తిడి నుంచి బ‌య‌టప‌డి తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు చెప్పుకొచ్చాడు.ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో మ్యాక్స్‌వెల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉండగా.. విని రామన్‌ తల్లిదండ్రులు చాన్నాళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిలయ్యారు. విని రామన్‌ సైతం అక్కడే పుట్టి పెరగ్గా.. ప్రస్తుతం వృత్తిరీత్యా ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నది. ఈ క్యూట్ క‌పుల్‌కి సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. పెళ్లి వ‌ల‌న మ్యాక్స్‌వెల్ పాక్ టూర్‌కి కూడా దూర‌మ‌య్యే ఛాన్స్ ఉంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి