CM Vijay : చరిత్ర లో ఏ CM తీసుకొని నిర్ణయం తీసుకున్న విజయ్ , ఏమి గట్స్ సామి..?
CM Vijay , తమిళ తాయ్ వాజ్తు, సీఎం విజయ్, తమిళనాడు రాజకీయాలు, తమిళనాడు అసెంబ్లీ, తమిళ రాష్ట్ర గీతం , తమిళ భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కులకు సంబంధించిన అంశంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
CM Vijay : తమిళ భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కులకు సంబంధించిన అంశంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక కార్యక్రమాలు, విద్యాసంస్థల్లో రాష్ట్ర గీతమైన ‘తమిళ తాయ్ వాజ్తు’ కు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయించారు. జాతీయ గీతం కంటే ముందుగానే రాష్ట్ర గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని సూచిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు సభలోని అన్ని వర్గాల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. ఈ నిర్ణయం కేవలం ఒక గీతానికి ప్రాధాన్యత ఇవ్వడం మాత్రమే కాదని, తమిళ భాషా గౌరవం, రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపు, భాషా హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశంగా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్ర గీతానికి ప్రత్యేక స్థానం ఉంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్ర గీతం ప్రాధాన్యతపై కొత్తగా చర్చ మొదలైంది. అధికారిక వేడుకల్లో ముందుగా వందేమాతరం, ఆ తర్వాత జాతీయ గీతమైన జన గణ మన ఆలపించాలని, రాష్ట్ర గీతాలను ఆ తర్వాత ఉంచాలని మార్గదర్శకాల్లో సూచించినట్లు పేర్కొంటున్నారు.
CM Vijay : చరిత్ర లో ఏ CM తీసుకొని నిర్ణయం తీసుకున్న విజయ్ , ఏమి గట్స్ సామి..?
CM Vijay ‘తమిళ తాయ్ వాజ్తు’కు ప్రాధాన్యత ఎందుకు?
దీంతో తమిళనాడులో భాష, రాష్ట్ర హక్కుల అంశంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కొన్ని విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవ కార్యక్రమాల్లో ‘తమిళ తాయ్ వాజ్తు’కు మూడో స్థానం కేటాయించడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక, భాషా హక్కులను కాపాడటమే లక్ష్యంగా సీఎం విజయ్ అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని తీసుకొచ్చారు.‘తమిళ తాయ్ వాజ్తు’కు కూడా సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉంది. ప్రముఖ కవి మనోన్మయం సుందరం పిళ్లై 1891లో రచించిన ప్రసిద్ధ నాటకం ‘మనోన్మయం’ నుంచి ఈ గీతాన్ని స్వీకరించారు. తమిళనాడులో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రారంభించే సమయంలో ‘తమిళ తాయ్ వాజ్తు’ను మొదటగా ఆలపించే సంప్రదాయాన్ని 1970లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ప్రభుత్వం అధికారికంగా అమల్లోకి తీసుకొచ్చింది.ఈ సంప్రదాయానికి మరింత అధికారిక గుర్తింపు 2021లో లభించింది. గత డీఎంకే ప్రభుత్వం 2021 డిసెంబర్ 12న ‘తమిళ తాయ్ వాజ్తు’ను అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. అప్పటి నుంచి రాష్ట్ర గీతంగా దీనికి ప్రత్యేక ప్రాధాన్యత కొనసాగుతోంది.
CM Vijay అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం
తాజాగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం విజయ్ భావోద్వేగభరితంగా ప్రసంగించారు. మాతృభాష అనేది కన్నతల్లితో సమానంగా పవిత్రమైనదని, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. ప్రతి తమిళుడి జీవితం, భావోద్వేగాలు, గుర్తింపుతో తమిళ భాష ముడిపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.తమిళనాడు గడ్డపై ‘తమిళ తాయ్ వాజ్తు’కు ఎప్పటికీ ప్రథమ స్థానం దక్కాల్సిందే అని సీఎం విజయ్ స్పష్టం చేశారు. రాష్ట్ర గీతానికి మొదటి స్థానం కల్పించడం తమిళనాడు రాష్ట్ర హక్కు అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయ భేదాలను పక్కనపెట్టి అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ తీర్మానానికి మద్దతు తెలిపారు. దీంతో అసెంబ్లీ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తమిళ భాష, సంస్కృతి, రాష్ట్ర హక్కుల పరిరక్షణ విషయంలో ఈ నిర్ణయం కీలక అడుగుగా నిలిచిందనే చర్చ జరుగుతోంది.







