Glenn Maxwell : ప్రస్తుతం టీ 20 వరల్డ్ కప్ టోర్నీ ఎంత రంజుగా సాగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. సెమీస్‌కి చేరేందుకు అన్ని టీంస్ గట్టిగా ఫైట్ చేస్తున్నాయి. గ్రూప్ ఏలో న్యూజిలాండ్, ఇంగ్లండ్ సెమీస్‌కి చేరిన విషయం తెలిసిందే. సూపర్-12 దశలోనే ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించడం గమనార్హం. శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఇంగ్లండ్ ఏడు పాయింట్లు సాధించింది. అయితే, ఆస్ట్రేలియా కూడా ఏడు పాయింట్లతోనే ఉన్నప్పటికీ, ఇంగ్లండ్ రన్‌రేట్ ఎక్కువగా ఉంది. దీంతో ఇంగ్లండ్ సెమీ ఫైనల్ చేరుకుంది. గ్రూప్-1 నుంచి సెమీస్ చేరిన రెండో జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది.
ఇప్పటికే సెమీస్ చేరిన న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఇక గ్రూప్-2 నుంచి ఇండియా సెమీస్‌కి వెళ్లగా, మరి కొద్ది నిమిషాలలో రెండో టీం ఏదన్నది తెలిపోతుంది. అయితే ఆస్ట్రేలియా సెమీస్‌కి కూడా చేరకుండా బయటకు రావడం అభిమానులతో పాటు ఆటగాళ్లని కూడా కలవరపరుస్తుంది. ఆస్ట్రేలియా ఓటములకు పునాది న్యూజిలాండ్ వేసింది. తొలి మ్యాచ్‌లో 89 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ తర్వాత శ్రీలంక 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్నే నమోదు చేసింది. కానీ, మూడో మ్యాచ్ మాత్రం వర్షార్పణం అయ్యింది. అందువల్ల గెలిచుంటే ఒక పాయింట్ ఎక్కువే ఉండేది. కానీ, వర్షం కూడా వీరి ఓటమిలో కీలక పాత్ర పోషించింది.
ఇక ఆఫ్గనిస్తాన్ జట్టు మాత్రం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్‌పై గట్టి దెబ్బే కొట్టింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి పరుగు ఆస్ట్రేలియాని సెమీస్‌కు దూరం చేయడంలో కీలకంగా మారాయి. అయితే ఈ పరాజయం పట్ల జట్టు, ఫ్యాన్స్ ఎలా స్పందించినా కూడా మ్యాక్స్ వెల్ పేరు మాత్రం వైరల్‌గా మారింది. తన సోషల్ మీడియా వేదికగా బగ్గర్(పెద్ద బూతు) అంటూ ట్వీట్ చేశాడు. అయతే అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అలా ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనే అంశాలపై క్లారిటీ లేదు. కానీ, నెట్టింట మాత్రం ఎవరికి తోచింది వాళ్లు అనేసుకుంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.