Hardik Pandya : హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్ దారుణమైన ప్రదర్శన కనబరుస్తుంది శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఢిల్లీ గెలిచింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇదే అత్యధిక స్కోరు. జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (84; 27 బంతుల్లో, 11×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్ తో పాటు . ట్రిస్టన్ స్టబ్స్ (48*; 25 బంతుల్లో, 6×4, 2×6), షై హోప్ (41; 17 బంతుల్లో, 5×6) విరుచుకుపడడంతో ఢిల్లీ 257 పరుగులు చేసింది. ఇక లక్ష్య చేధనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (63; 32 బంతుల్లో, 4×4, 4x,6) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్య (46; 24 బంతుల్లో, 4×4, 3×6), టిమ్ డేవిడ్ (37; 17 బంతుల్లో, 2×4, 3×6) ఓ మోస్తరుగా రాణించారు.
అయతే ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదటి బంతి నుంచే దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్లను ఉతికి ఆరేసిన ఢిల్లీ బ్యాటర్లు కేవలం 10 ఓవర్లలో 128 పరుగులు చేశారంటే వారి రచ్చ ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీ ప్లేయర్ల ధనాధన్ బ్యాటింగ్ చూసి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహనం కోల్పోయాడు. ముఖ్యంగా వారిని నిలువరించేందుకు ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలనేది హార్ధిక్ కి అర్ధం కాక సతమతం అయ్యాడు. ఆ సమయంలో ముంబై కెప్టెన్ కు మాజీ సారథి రోహిత్ శర్మ సహకరించాడు. అయితే ఈ మ్యాచ్ లో ఓ సందర్భంలో హార్దిక్ నేరుగా అంపైర్‌తో గొడవకు దిగడం చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఢిల్లీ బ్యాటర్ల ఊచకోతతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆందోళన చెందాడు. బౌలర్లు ఎంత కష్టపడినా వికెట్ పడకపోవడంతో అసహనానికి లోనయ్యాడు. వికెట్ పడిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ మైదానంలోకి రావడం ఆలస్యమైంది. దీంతో హార్దిక్‌కి కోపం వచ్చింది. నేరుగా అంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అయితే అంపైర్ సరిగా స్పందించకపోడంతో పాండ్యా తీవ్ర ఆగ్రహావేశానికి లోనైనట్లు తెలుస్తుంది.అయితే హార్ధిక్ కోపానికి కారణం లేకపోలేదు. ఐపీఎల్ నియమ నిబంధనల ప్రకారం, ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయంలోగా ఇన్నింగ్స్‌ను ముగింయకపోతే స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధిస్తారు. అందుకే హార్ధిక్ అలా రియాక్ట్ అయి ఉంటాడని అంటున్నారు
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.