
Hardik Pandya trolled by netigens
Hardik Pandya : వరల్డ్ కప్‌లో దారుణంగా నిరాశపరచిన భారత జట్టు న్యూజిలాండ్ గడ్డపై సిరీస్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే మూడు టీ20ల సిరీస్‌లో ఒక్క మ్యాచ్ సజావుగా సాగితే ఓ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దు అయింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. మూడు టీ 20ల సిరీస్‌లో టీమిండియా ఒక మ్యాచ్ భారీ విజయం సాధించి ఇక సిరీస్ గెలుచుకుంది. ఇక టీ20 సిరీస్ ముగియడంతో వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది భారత ఆటగాళ్ల జట్టు… పొట్టి ఫార్మాట్‌లో చోటు దక్కించుకోలేకపోయిన క్రికెటర్లు, వన్డే సిరీస్‌లో అయినా ఛాన్స్ వస్తుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే టీ 20 జట్టులో సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టు అవకాశం ఇవ్వకపోవడంపై నెటిజన్లు ప్రశ్నలు సంధించగా.. ఇది నా జట్టు నా ఇష్టమని హార్ధిక్ పాండ్యా సమాధానమిచ్చాడు. బయటి వ్యక్తుల మాటలు తమను ప్రభావం చేయలేవని, కోచ్‌తో మాట్లాడిన తర్వాతే అత్యుత్తమ ఆటగాళ్లను తీసుకుంటానని కాస్త పొగరుగానే స్పందించాడు హార్ధిక్ . అతని వ్యవహార శైలి ఎవరికి నచ్చలేదు. పూర్తి స్థాయి కెప్టెన్ కాకముందే హార్దిక్ పాండ్యా.. ఇంత అహంకారపూరితంగా మాట్లాడుతుంటే.. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అటిట్యూడ్ ఉన్న కారణంగానే ముంబై ఇండియన్స్ అతన్ని వదిలేసిందని, ఈ తరహా ప్రవర్తన అతనితో పాటు జట్టుకు మంచిది కాదని కొందరు సూచిస్తున్నారు.
Hardik Pandya trolled by netigens
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కూడా హార్దిక్ ఇలానే ప్రవర్తించాడని, మైదానంలో సీనియర్ ఆటగాళ్లనే గౌరవం లేకుండా నోరు పారేసుకున్నాడని కొందరు గుర్తు చేస్తున్నారు. కెప్టెన్ అయ్యాక రెండు మ్యాచ్‌ల్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదని , ఐదు మ్యాచ్‌లకే ఇంత పొగరు చూపిస్తే.. భవిష్యత్తులో ఇంకా ఎలా ఉంటాడోనని కొందరు అయోమయంలో పడ్డారు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ గడ్డ మీద టీ20 సిరీస్ నెగ్గిన రెండో భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హార్ధిక్ పాండ్యా. ఇంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా రెండేళ్ల తర్వాత హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో 1-0 తేడాతో సిరీస్ సొంతం చేసుకొని అద్భుతం సృష్టించింది.
Business Idea : ప్రస్తుత కాలంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, పెట్రోల్ పంప్ వ్యాపారం అనేది అత్యంత…
Bald Head : వివాహ బంధం అనేది కష్టసుఖాల్లో తోడుంటామనే ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ చైనాలోని హెనాన్…
Business Idea: తక్కువ పెట్టుబడితో కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ప్రస్తుతం ఒక ట్రెండీ ఐడియా బాగా పాపులర్ అవుతోంది.…
Free Sewing Machine Scheme 2026: మహిళల ఆర్థిక స్వావలంబనను లక్ష్యంగా పెట్టుకుని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న క్రాంతి…
Good News : భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఖరారయ్యే…
Gold Rate Today Jan 26th 2026 : నేడు 2026, జనవరి 26న అంతర్జాతీయ మరియు దేశీయ మార్కెట్లలో…
Karthika Deepam 2 Today Episode : ఈరోజు ఎపిసోడ్లో డాక్టర్ ఇవాళ రారని నమ్మకంగా జ్యోత్స్న ఇంటి నుంచి…
Harsha Vardhan : తెలుగు ప్రేక్షకులకు హర్షవర్ధన్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ.…
This website uses cookies.