SRH : క్వాలిఫయర్-1 ఓడినా స‌రే.. అయిన కూడా క‌ప్ హైద‌రాబాద్‌దే..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

SRH : క్వాలిఫయర్-1 ఓడినా స‌రే.. అయిన కూడా క‌ప్ హైద‌రాబాద్‌దే..!

SRH  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి టేబుల్‌లో తొలి స్థానం సంపాదించుకున్న కేకేఆర్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో కూడా అద‌ర‌గొట్టింది. ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో కోల్‍కతా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై అలవోక విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍ను కోల్‍కతా చిత్తు చేసింది. 38 బంతులు మిగిలి ఉండ‌గానే, శ్రేయస్ అయ్యర్ సేన ల‌క్ష్యాన్ని చేధించి డైరెక్ట్‌గా ఫినాలేకి చేరుకుంది. దీంతో ఐపీఎల్‍లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 May 2024,1:00 pm

SRH  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి టేబుల్‌లో తొలి స్థానం సంపాదించుకున్న కేకేఆర్ క్వాలిఫ‌య‌ర్ మ్యాచ్‌లో కూడా అద‌ర‌గొట్టింది. ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో కోల్‍కతా.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై అలవోక విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍ను కోల్‍కతా చిత్తు చేసింది. 38 బంతులు మిగిలి ఉండ‌గానే, శ్రేయస్ అయ్యర్ సేన ల‌క్ష్యాన్ని చేధించి డైరెక్ట్‌గా ఫినాలేకి చేరుకుంది. దీంతో ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్ చేరింది కేకేఆర్. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్) అర్ధ శతకం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (32), ప్యాట్ కమిన్స్ (30) రాణించారు.

 SRH  మ‌నదే టైటిల్..

ట్రావిస్ హెడ్ (0) తొలి ఓవర్లోనే డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (3), నితీశ్ సుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0), సన్వీర్ సింగ్ (0) ఫెయిల్ అయ్యారు. అబ్దుల్ సమాద్ (16) కాసేపే నిలిచాడు. త్రిపాఠి హాఫ్ సెంచరీ, చివర్లో కమిన్స్ పోరాటంతో హైదరాబాద్‍కు ఆ మాత్రం స్కోరై చేశారు. ఇక కోల్‍కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఓ వికెట్ ద‌క్కింది.. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయినా..మిచెల్ స్టార్క్ కీల‌క మ్యాచ్‌లో ఫామ్‌లోకి వ‌చ్చాడు. ముఖ్య‌మైన మూడు వికెట్స్ తీసాడు. దాంతో స‌న్‌రైజ‌ర్స్ పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక‌పోయింది. ఇక లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (14 బంతుల్లో 23 పరుగులు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21 పరుగులు) పర్వాలేదనిపించారు.

SRH క్వాలిఫయర్ 1 ఓడినా స‌రే అయిన కూడా క‌ప్ హైద‌రాబాద్‌దే

SRH : క్వాలిఫయర్-1 ఓడినా స‌రే.. అయిన కూడా క‌ప్ హైద‌రాబాద్‌దే..!

ఆ తర్వాత శ్రేయస్, వెంకటేశ్ సునామీ హిట్టింగ్‍తో ఆడుతూ పాడుతూ టార్గెట్‍ను కరిగించేశారు.వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో సునాయాసంగా విజ‌యం సాధించింది కేకేఆర్. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా.. క్వాలిఫయర్-2లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుతుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు అంటున్నారు. 2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ గెలిచింది, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. ఇదే క్ర‌మంలో 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియ‌న్‌గా నిల‌వ‌గా, ఆ త‌ర్వాత జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ ఇదే. ఆ సెంటిమెంట్ ప్ర‌కారం ఐపీఎల్ 2024 టైటిల్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది