SRH : క్వాలిఫయర్-1 ఓడినా సరే.. అయిన కూడా కప్ హైదరాబాద్‌దే..!
SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి టేబుల్‌లో తొలి స్థానం సంపాదించుకున్న కేకేఆర్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో కూడా అదరగొట్టింది. ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో కోల్‍కతా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అలవోక విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍ను కోల్‍కతా చిత్తు చేసింది. 38 బంతులు మిగిలి ఉండగానే, శ్రేయస్ అయ్యర్ సేన లక్ష్యాన్ని చేధించి డైరెక్ట్‌గా ఫినాలేకి చేరుకుంది. దీంతో ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్ చేరింది కేకేఆర్. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్) అర్ధ శతకం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (32), ప్యాట్ కమిన్స్ (30) రాణించారు.
ట్రావిస్ హెడ్ (0) తొలి ఓవర్లోనే డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (3), నితీశ్ సుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0), సన్వీర్ సింగ్ (0) ఫెయిల్ అయ్యారు. అబ్దుల్ సమాద్ (16) కాసేపే నిలిచాడు. త్రిపాఠి హాఫ్ సెంచరీ, చివర్లో కమిన్స్ పోరాటంతో హైదరాబాద్‍కు ఆ మాత్రం స్కోరై చేశారు. ఇక కోల్‍కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఓ వికెట్ దక్కింది.. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయినా..మిచెల్ స్టార్క్ కీలక మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. ముఖ్యమైన మూడు వికెట్స్ తీసాడు. దాంతో సన్‌రైజర్స్ పెద్దగా పరుగులు చేయలేకపోయింది. ఇక లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్.. 13.4 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (14 బంతుల్లో 23 పరుగులు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21 పరుగులు) పర్వాలేదనిపించారు.
SRH : క్వాలిఫయర్-1 ఓడినా సరే.. అయిన కూడా కప్ హైదరాబాద్‌దే..!
ఆ తర్వాత శ్రేయస్, వెంకటేశ్ సునామీ హిట్టింగ్‍తో ఆడుతూ పాడుతూ టార్గెట్‍ను కరిగించేశారు.వెంకటేశ్ అయ్యర్(28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 51 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో సునాయాసంగా విజయం సాధించింది కేకేఆర్. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్, కమిన్స్ తలో వికెట్ తీసారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా.. క్వాలిఫయర్-2లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుతుందని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు అంటున్నారు. 2015లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ గెలిచింది, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 2016లో సన్‌రైజర్స్ విజేతగా నిలిచింది. ఇదే క్రమంలో 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా నిలవగా, ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఇదే. ఆ సెంటిమెంట్ ప్రకారం ఐపీఎల్ 2024 టైటిల్‌ను సన్‌రైజర్స్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు.
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.