Ind vs Pak : టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడగా, ఈ మ్యాచ్ క్రియేట్ చేసిన రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఆఖరి బంతికి భారత్ విజయం సాధించడంతో మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. విరాట్ కోహ్లీ 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి భారత్‌కు ఈ విజయాన్ని అందించాడు. ఈ విజయంతో భారత జట్టు తన పేరిట అనేక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్‌లో చివరి మూడు ఓవర్లలో విజయం కోసం నమోదైన అత్యధిక పరుగులు కూడా ఇవే కావడం విశేషం.
చివరి బంతికి భారత్ విజయం సాధించగా, చివరి బంతికి టీ20లో విజయం సాధించడం ఇది నాలుగోసారి. 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దీని తర్వాత హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లో చేర్చారు. ఈ ఇద్దరి భాగస్వామ్యం T20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ వికెట్‌కైనా పాకిస్థాన్‌పై భారత్‌కు అతిపెద్ద భాగస్వామ్యంగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించడం.. ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకోవడం రికార్డు వ్యూస్‌ను తెచ్చిపెట్టింది.
ఈ మ్యాచ్‌తో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంటపండించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్స్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఆసియాకప్ వేదికగా భారత్ -పాక్ తొలి మ్యాచ్ కోటీ 30 లక్షల వ్యూస్‌తో ఐపీఎల్ 2022 సీజన్, గత టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా మ్యాచ్ కోటీ 80 లక్షల వ్యూస్ రాబట్టింది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లే అని అంటున్నారు.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.