Ind vs Eng Test : చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కొనసాగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తడబడింది. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 164 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై భారత్ 317 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
Ind vs Eng Test team india won on england in chennai 2nd test
మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అవగా, రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం అయ్యారు. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించడంతో భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టారు. ఏ దశలోనూ వారు స్పిన్‌ను ఆడలేకపోయారు.
తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 161 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన చేయగా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 106 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ ఇన్నింగ్స్ వల్లే భారత్ భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఎదుట ఉంచ గలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనే అశ్విన్‌కు 3 వికెట్లు దక్కాయి. మొదటి టెస్టు మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం భారత్ ఇంగ్లండ్‌ను ఈ మ్యాచ్‌లో అలాగే దెబ్బతీసి రివేంజ్ తీర్చుకుంది.
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
Best Phones : భారత మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…
Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…
India : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…
This website uses cookies.