Ind vs Eng Test : ఇంగ్లండ్‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. మ‌నోళ్లు కుమ్మేశారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ind vs Eng Test : ఇంగ్లండ్‌పై భార‌త్ బంప‌ర్ విక్ట‌రీ.. మ‌నోళ్లు కుమ్మేశారు..!

 Authored By maheshb | The Telugu News | Updated on :16 February 2021,1:18 pm

Ind vs Eng Test : చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో కొన‌సాగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఇంగ్లండ్ త‌డ‌బ‌డింది. ఫ‌లితంగా ఆ జ‌ట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 164 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌పై భార‌త్ 317 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Ind vs Eng Test team india won on england in chennai 2nd test

Ind vs Eng Test team india won on england in chennai 2nd test

Ind vs Eng Test : ఇంగ్లండ్‌పై భార‌త్ 317 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం

మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేప‌ట్టిన భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 329 ప‌రుగుల‌కు ఆలౌట్ అవ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో 286 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 ప‌రుగులు చేసింది. భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కోవ‌డంలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫ‌లం అయ్యారు. పిచ్ పూర్తిగా స్పిన్న‌ర్ల‌కు అనుకూలించ‌డంతో భార‌త స్పిన్న‌ర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టారు. ఏ ద‌శలోనూ వారు స్పిన్‌ను ఆడ‌లేక‌పోయారు.

తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శ‌ర్మ 161 ప‌రుగులు చేసి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గా రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 106 ప‌రుగులు చేసి కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ ఇన్నింగ్స్ వ‌ల్లే భార‌త్ భారీ ల‌క్ష్యాన్ని ఇంగ్లండ్ ఎదుట ఉంచ గ‌లిగింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయ‌గా, రెండో ఇన్నింగ్స్‌లో అక్ష‌ర్ ప‌టేల్ 5 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనే అశ్విన్‌కు 3 వికెట్లు ద‌క్కాయి. మొద‌టి టెస్టు మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యం అనంత‌రం భార‌త్ ఇంగ్లండ్‌ను ఈ మ్యాచ్‌లో అలాగే దెబ్బ‌తీసి రివేంజ్ తీర్చుకుంది.

maheshb

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది