Home » Entertainment » Sri Vishnu Latest Movie Bala Tandanana Title Poster Release
Entertainment

Sri vishnu : శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘భళా తందనాన’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..!

Authored By
vamana sai
The Telugu News | Published on: February 16, 2021, 2:30 pm
Advertisement

Sri vishnu : శ్రీవిష్ణు టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అందరు హీరోల మాదిరిగా మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా మంచి కథలని ఎంచుకుంటూ తన ఇమేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు శ్రీవిష్ణు మినిమం గ్యారెంటీ హీరో అన్న పేరు తెచ్చుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద తన సినిమాలు మంచి వసూళ్ళని రాబడుతున్నాయి. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరొక వైపు టాలీవుడ్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు. కాగా ఈ యంగ్ హీరో నుంచి మరో విభిన్నమైన సినిమా రాబోతోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడం విశేషం.

Advertisement

sri-vishnu-latest movie bala tandanana title poster release

కాగా తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు దర్శక, నిర్మాతలు. బాణం .. బసంతి సినిమాలతో టాలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న యువ దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రానికి ‘భళా తందనాన’అన్న చక్కటి తెలుగు టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఈ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ముందు నుంచి శ్రీవిష్ణు ఎలాంటి సినిమాలలో నటించి ఆకట్టుకున్నాడో అలాంటి కథ తోనే ‘భళా తందనాన’ తెరకెక్కుతుందని టైటిల్ పోస్టర్ ని చూస్తే తెలుస్తోంది.

Advertisement

Sri vishnu : శ్రీ విష్ణు జంటగా క్యాథరిన్ ట్రెసా ..!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ విష్ణు జంటగా క్యాథరిన్ ట్రెసా హీరోయిన్ గా నటించనుంది. అంతేకాదు ‘కేజీఎఫ్’ సినిమాలో విలన్ గా నటించిన రామచంద్రరాజు ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. కాగా ‘భళా తందనాన’ సినిమా పుజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి నుండి ప్రారంభమవుతుందని .. ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి