#image_title
IND vs Bangladesh : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్ లలో గెలిచి వరల్డ్ కప్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది భారత్. తాజాగా నాలుగో మ్యాచ్ లో భాగంగా భారత్.. బంగ్లాదేశ్ తో పోటీ పడుతోంది. ఈ మ్యాచ్ లో పూణేలో జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ ఫీల్డింగ్ చేస్తోంది. అయితే.. బౌలింగ్ చేస్తూ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఆయనకు కాలు కింద మణికట్టు దగ్గర తీవ్రంగా నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఓవర్ మధ్యలో ఇలా జరగడంతో ఆ ఓవర్ పూర్తిగా పాండ్యా వేయలేకపోయాడు. దీంతో హుటాహుటిన పాండ్యాను స్టేడియం నుంచి బయటికి పంపించారు. హఠాత్తుగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ నుంచి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది పాండ్యా.
తొలి మూడు బంతులు వేసిన పాండ్యా… ఆ తర్వాత వేయలేకపోయాడు. మూడో బంతిని వేసిన తర్వాత బాల్ ను తన కుడికాలితో ఆపాలని ప్రయత్నించి పట్టు తప్పి తన ఎడమ కాలిపై పడ్డాడు. దీంతో ఆయన మడమకు గాయం అయింది. కేవలం మూడు బాల్స్ మాత్రమే పాండ్యా వేయడంతో పాండ్యా ఓవర్ ను విరాట్ కోహ్లీ వచ్చి పూర్తి చేశాడు. మూడు బంతులు కోహ్లీ వేశాడు. మరో వైపు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ పూర్తయ్యాయి. 50 ఓవర్లలో బంగ్లాదేశ్ 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో లిట్టన్ దాస్ 66, హాసన్ 51 పరుగులు చేసి జట్టుకు పరుగులు అందించారు. ఇక.. మహ్మదుల్లా 46 పరుగులు, రహీమ్ 38 పరుగులు, హ్రిడాయ్ 16 పరుగులు, ఇస్లాం 7, శాంటో 8, మిరాజ్ 3 పరుగులు చేశారు. ఇక.. మన టీమిండియా బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, జడేజా 2 వికెట్లు, యాదవ్ ఒక్క వికెట్, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ తీశాడు. ఇక.. 256 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. భారత్ కు 257 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
#image_title
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.