KL Rahul : కేఎల్.. రాహుల్.. ఆడిన ప్రతి సారి అద్భుతమైన ఆటతో భారత్‌కి మంచి విజయాలు అందించాడు. ఇటీవల పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులు పడుతున్నాడు రాహుల్. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వేదికగా భారత్ ,పాకిస్తాన్ మధ్య జరిగిన టీ 20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లో అతడు 8 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ ప్రదర్శన తర్వాత భారత ఓపెనర్ నెట్టింట్లో దారుణంగా ట్రోల్ చేయబడుతున్నారు. నసీం షా బౌలింగ్ బంతిని ఆడడానికి ప్రయత్నించగా బాల్ బ్యాట్ ను తాకి వికెట్లకు తాకింది. దీంతో కేఎల్ రాహుల్ 4 పరుగులకే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ ఔట్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. పాక్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా మరోసారి భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్‌ను బలిపశువును చేశాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్‌పై భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ కీలక మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో పీడ కలగా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో రాహుల్ 8 బంతుల్లో కేవలం 4 పరుగులే చేశారు. నసీమ్ షా వేసిన అద్భుతమైన బంతితో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇంతకుముందు ఆసియా కప్ 2022లో కూడా KL రాహుల్ నసీమ్ షా చేతిలో అవుట్ అయ్యాడు. ఈ రోజు మరోసారి నసీమ్ రాహుల్‌కి పెవిలియన్‌కు దారి చూపించాడు. చాలా కాలంగా..కేఎల్ రాహుల్ నిరంతరం అదే విధంగా ఔట్ అవుతున్నారు. రాహుల్ తనలోని ఈ బలహీనతను ఎందుకు అధిగమించలేకపోతున్నాడనే ప్రశ్న తలెత్తింది.
రాహుల్ సమస్య టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. కేఎల్ రాహుల్ తరచుగా పెద్ద మ్యాచ్‌లలో ఫ్లాప్ అవుతున్నాడుకేఎల్ రాహుల్‌కి పదే పదే అవకాశాలు ఇస్తున్నా కూడా దానిని ఉపయోగించుకోవడం లేదు. ఇలా అయితే రానున్న రోజులలో శిఖర్ ధావన్‌కు అవకాశం కల్పించవచ్చు లేదా కేఎల్ రాహుల్ స్థానంలో పంత్‌కి అవకాశం కల్పించి అతడిని ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తే.. టీమిండియా మరింత మెరుగైన ప్రదర్శనలు చేయగలదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేఎల్ రాహుల్ విషయంలో సెలక్టర్స్ సరైన నిర్ణయం తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన పాకిస్థాన్ బ్యాటింగ్ కు దిగింది. 20 ఓవర్లలో8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. చివరి బంతికి భారత్ ఆ స్కోర్‌ని చేధించింది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.