Home » Exclusive » Ishan Kishan Girlfriend Name Viral In Social Media
Exclusive

Ishan Kishan : ఇషాన్ కిషన్ డ‌బుల్ సెంచరీతో ర‌చ్చ చేస్తున్న ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు ..!

Authored By
Sam C
The Telugu News | Updated on: December 12, 2022 12:13 pm
Advertisement

Ishan Kishan : టీమిండియా యువ ఓపెనర్, డబుల్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్ రీసెంట్‌గా బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌బుల్ సెంచరీ కొట్టిన విష‌యం తెలిసిందే. కోహ్లీ ఇచ్చిన స‌పోర్ట్‌తో చెల‌రేగి ఆడిన ఇషాన్ కిషాన్ ఆకాశ‌మే హ‌ద్దుగా రెచ్చిపోయి ఆడాడు. గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న పేరు తెగ వార్త‌ల‌లో నానుతూ వ‌స్తుంది. కెరీర్‌లో తొలి సెంచరీనే డబుల్ సెంచరీగా మలచిన ఇషాన్ ఇన్నింగ్స్‌ను ప్రతి ఒక్కరు కొనియాడుతూ ఉన్నారు. దిగ్గజ క్రికెట్ సచిన్ టెండూల్కర్ నుంచి సహచర ఆటగాళ్ల వరకు ప్రతీ ఒక్కరు ఇషాన్‌ను పొగుడుతూనే ఉన్నారు. దీంతో ఈ ముంబై ప్లేయర్ పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హోరెత్తుతోంది. ఇదిలా ఉంటే ఒక స్పెషల్‌ పర్సన్‌

Advertisement

నుంచి ఇషాన్‌ కిషన్‌కు విషెస్‌ అందడం ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఆమె మరెవరో కాదు ఇషాన్‌ ప్రియురాలిగా ప్రచారం అవుతున్న‌అదితి హుండియా. ఈ సందర్భంగా ఇషాన్‌ను ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్న అదితి.. రెడ్‌ హార్ట్‌ ఎమోజీతో తన ప్రేమను చాటుకోవ‌డంతో పాటు అతని స్పెషల్‌ ఇన్నింగ్స్‌కు సంబంధించి బీసీసీఐ షేర్‌ చేసిన పోస్టును కూడా రీషేర్‌ చేసింది. దీంతో ఇప్పుడు ఇషాన్‌, అదితి పేర్లు సామాజికి మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే అదితి విష‌యానికి వ‌స్తే.. 2019 మిస్ ఇండియా పోటీల్లో ఫైనల్‌ వరకు చేరుకున్న అదితి.. మోడల్‌గా త‌న కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇషాన్ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తిగా, అతని గర్ల్‌ఫ్రెండ్‌గా ఈమె ప్రచారంలో అయితే ఉంది.

Advertisement

Ishan Kishan : గ‌ర్ల్ ఫ్రెండ్ హంగామా..!

ఈ ఇద్దరు పలుసార్లు జంటగా కెమెరాకి చిక్కారు. ఐపీఎల్‌లో ఇషాన్‌ కిషన్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న మ్యాచ్‌లకు ముంబై జెర్సీ వేసుకుని పలుమార్లు ఆమె హాజరైంది. అలాగే ఇన్ స్టాలో ఆమె పెట్టే పోస్టులకు ఇషాన్, ఇషాన్ పెట్టే పోస్టులకు అదితి రిప్లేలు ఇచ్చుకుంటుంటూ ఉండ‌డంతో అనేక అనుమానాలు త‌లెత్తాయి. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ కథనాలు కూడా పుట్టుకొచ్చాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌పై ఇషాన్‌ కానీ, అదితి గానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో ఇషాన్‌ ద్విశతకం బాదడంతో అతనిపై ప్రశంసలు కురిపిస్తూ అదితి షేర్‌ చేసిన పోస్టు పెట్ట‌డంతో అనుమానాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి