Home » News » Ms Dhoni Is Going To Be A Father
News

MS Dhoni : ఎంఎస్ ధోని తండ్రి కాబోతున్నట్లు చెప్పిన రైనా భార్య..

Authored By
mallesh
The Telugu News | Published on: October 17, 2021, 6:00 am
Advertisement

MS Dhoni : మిస్టర్ కూల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో చెన్నయ్ సూపర్ కింగ్స్ నాల్గో సారి ఐపీఎల్ 2021 టైటిల్ గెలుచుకున్న సంగతి అందరికీ విదితమే. ధోని సేన టైటిల్ నెగ్గడం పట్ల క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. టైటిల్ గెలవడం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు ధోనికి సంతోషమే కాగా మరో సంతోషకరమైన వార్త వచ్చేసింది. అదేంటంటే… ధోని మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సురేశ్ రైనా వైఫ్ ప్రియాంక ధ్రువీకరించింది. ధోని వైఫ్ సాక్షి 2022లో ప్రసవించబోతున్నట్లు పేర్కొంది.కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఫ్రైడ్ నైట్ దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదలు బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్న చెన్నై 27 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.

Advertisement

ms dhoni is going to be a father

ఇక ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోనితో కలిసి మైదానంలో ఆయన వైఫ్ సాక్షి, కూతురు జీవా అక్కడకు వచ్చారు. ఈ క్రమంలోనే వారు సందడి చేశారు. చెన్నయ్ సూపర్ కింగ్స్ గెలవగానే క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఇకపోతే ధోనిని ఆయన వైఫ్ సాక్షి, కూతురు జీవా మైదానంలో హత్తుకున్నారు. ఈ నేపథ్యంలోనే సాక్షి వేసుకున్న డ్రెస్ ఆధారంగా ఆమె మళ్లీ ప్రెగ్నెంట్ అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టంది. ఈ క్రమంలోనే క్రికెటర్ సురేశ్ రైనా వైఫ్ ప్రియాంక స్పందించింది. 2022లో సాక్షి మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది.ఎంఎస్ ధోని ఫ్యామిలీతో రైనా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. జీవా పుట్టిన సమయంలోనూ ధోని భార్య సాక్షి మొదట రైనా భార్య ప్రియాంకకు ఆ విషయం తెలిపినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

Advertisement

MS Dhoni : జూనియర్ ధోని రాబోతున్నాడని సంబురపడుతున్న మిస్టర్ కూల్ కెప్టెన్ అభిమానులు..

ms dhoni is going to be a father

అయితే, ఈ సారి అఫీషియల్‌గానే ప్రియాంక ధోని వైఫ్ ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేసింది. కాగా కొందరు ధోని అభిమానులు జూనియర్ ధోని రాబోతున్నాడాని సంతోషపడుతున్నారు. ఈ క్రమంలోనే జూనియర్ ధోని వస్తున్నాడు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇకపోతే ఎంఎస్ ధోని, సాక్షి లవ్ స్టోరి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఎంఎస్ ధోని, సాక్షి మ్యారేజ్ తర్వాత వీరికి జీవా అనే కూతురు పుట్టారు. ఇకపోతే గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడుతున్నాడు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి