Hardik Pandya : ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, కోహ్లీ, కేల్ రాహుల్ గైర్హాజరుతో హార్దిక్ పాండ్య కెప్టెన్ షిప్‌లో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. శ్రీలంకను 160 పరుగులకు ఆలౌట్ చేసి రెండు పరుగుల తేడాతో న్యూ ఇయర్‌లో తొలి విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపక్ హూడా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ బ్యాట్‌తో రాణించగా.. యువ బౌలర్లు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ బంతితో నిప్పులు చెరిగి టీమిండియాకి విజయం అందించారు. ఆరంగేట్రంలోనే భారత బౌలర్ శివమ్ మావి నాలుగు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు.
ఫస్ట్ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆయనకు సపోర్ట్‌గా ఉమ్రాన్, అక్షర్ పటేల్‌లు రెండేసి వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని విషయాలు అందరిని ఆశ్చర్యపరిచాయి. అదేంటంటే అద్భుతమైన బౌలింగ్ వేసి మంచి గణాంకాలు నమోదు చేసిన పాండ్యా.. తాను బౌలింగ్ వేయకుండా అక్షర్ కు ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరచింది. అయితే ఇలా ఎందుకు చేశాడు అనేది మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. కఠిన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా జయించాలో మా వాళ్లకు తెలియాలి అనే చివరి ఓవర్ అక్షర్ పటేల్ ని వేయమన్నాను.. ఇలాంటి పరిస్థితుల్లోని అనుభవం వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మేం ద్వైపాక్షిక సిరీస్ లల్లో బాగా ఆడుతామని మాకు తెలుసు.
ఇక ఈ రోజు ఆ ఒత్తిడిని మా కుర్రాళ్లు జయించారు” అని చెప్పుకొస్తూ తన జట్టుపై ప్రశంసలు కురిపిచాడు పాండ్యా. మరో వైపు పాండ్యా క్రీడా స్పూర్తిని పలువురు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బ్యాట్‌తోను ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 31 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేయగా, దీపక్ హుడా 41, ఇషాన్ కిషన్ (37) పరుగులు చేశారు. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ గురువారం (జనవరి 5)న జరగనుంది.
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
This website uses cookies.