Hardik Pandya : కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఈ విష‌యంలో మెచ్చుకోక త‌ప్ప‌దు.. ఎందుకో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hardik Pandya : కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా ను ఈ విష‌యంలో మెచ్చుకోక త‌ప్ప‌దు.. ఎందుకో తెలుసా..?

Hardik Pandya : ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ, కేల్ రాహుల్ గైర్హాజ‌రుతో హార్దిక్‌ పాండ్య కెప్టెన్ షిప్‌లో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. శ్రీలంకను 160 పరుగులకు ఆలౌట్ చేసి రెండు ప‌రుగుల తేడాతో న్యూ ఇయ‌ర్‌లో తొలి విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపక్ హూడా, ఇషాన్ కిషన్, అక్షర్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,3:40 pm

Hardik Pandya : ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ, కేల్ రాహుల్ గైర్హాజ‌రుతో హార్దిక్‌ పాండ్య కెప్టెన్ షిప్‌లో యువ ఆటగాళ్లతో సరికొత్తగా మారిన టీ20 జట్టు.. శ్రీలంకను 160 పరుగులకు ఆలౌట్ చేసి రెండు ప‌రుగుల తేడాతో న్యూ ఇయ‌ర్‌లో తొలి విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీపక్ హూడా, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ బ్యాట్‌తో రాణించగా.. యువ బౌలర్లు శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ బంతితో నిప్పులు చెరిగి టీమిండియాకి విజ‌యం అందించారు. ఆరంగేట్రంలోనే భారత బౌలర్ శివమ్ మావి నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి అదరగొట్టాడు.

ఫస్ట్ మ్యాచ్ లోనే నాలుగు వికెట్లను పడగొట్టాడు. ఆయ‌నకు స‌పోర్ట్‌గా ఉమ్రాన్‌, అక్షర్‌ పటేల్‌లు రెండేసి వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్‌లో కొన్ని విష‌యాలు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. అదేంటంటే అద్భుతమైన బౌలింగ్ వేసి మంచి గ‌ణాంకాలు న‌మోదు చేసిన పాండ్యా.. తాను బౌలింగ్ వేయకుండా అక్షర్ కు ఇవ్వ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. అయితే ఇలా ఎందుకు చేశాడు అనేది మ్యాచ్ అనంత‌రం చెప్పుకొచ్చాడు. కఠిన పరిస్థితుల్లో ఒత్తిడిని ఎలా జయించాలో మా వాళ్లకు తెలియాలి అనే చివ‌రి ఓవ‌ర్‌ అక్షర్ పటేల్ ని వేయ‌మ‌న్నాను.. ఇలాంటి పరిస్థితుల్లోని అనుభవం వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో మాకు ఎంతో ఉపయోగపడుతుంది. మేం ద్వైపాక్షిక సిరీస్ లల్లో బాగా ఆడుతామని మాకు తెలుసు.

netigens praise on Hardik Pandya

netigens praise on Hardik Pandya

Hardik Pandya : మంచి ప‌ని చేశావ్..!!

ఇక ఈ రోజు ఆ ఒత్తిడిని మా కుర్రాళ్లు జయించారు” అని చెప్పుకొస్తూ త‌న జ‌ట్టుపై ప్ర‌శంస‌లు కురిపిచాడు పాండ్యా. మ‌రో వైపు పాండ్యా క్రీడా స్పూర్తిని ప‌లువురు నెటిజ‌న్స్ ప్రశంసిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో అక్ష‌ర్ ప‌టేల్ బ్యాట్‌తోను ఆక‌ట్టుకున్నాడు. అక్షర్ పటేల్ 31 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 29 పరుగులు చేయ‌గా, దీపక్ హుడా 41, ఇషాన్ కిషన్ (37) ప‌రుగులు చేశారు. శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో టీ20 మ్యాచ్‌ గురువారం (జనవరి 5)న జరగనుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది