
pakistan fans prayers for india loss
Pakistan: ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ రంజుగా సాగుతుంది. గ్రూప్ ఏలో భారత్ ఉండగా, ఈ టీం తొలి పరాజయాన్ని చవి చూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది. భారత్ తమ గత మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్‌లను ఓడించింది. దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ బి పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకున్నాయి.
దక్షిణాఫ్రికా ఓడితే పాక్‌కి సెమీస్ అవకాశాలు చాలా ఉండేవి. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలని పాక్ క్రికెటర్స్, అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. కాని వారి పూజలు ఫలించలేదు. ఇప్పుడు భారత్ ఓటమి చెందాలని కోరుకుంటున్నారు. దాదాపు దక్షిణాఫ్రికా సెమీస్‌కి వెళ్లే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో భారత్ ఓటమి పాక్‌కి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. పాక్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, ఆ రెండు గెలిస్తే ఆరు పాయింట్స్ వస్తాయి.భారత్ ఒక మ్యాచ్ ఒడిపోతే ఆరు పాయింట్స్ ఉంటాయి. అప్పడు రన్ రేట్ కీలకగా మారనుంది. ఆ రకంగా పాక్‌కి ఏమైన అవకాశం ఉంటుందేమోనని పాక్ అభిమానులు భారత్ ఓటమిని కోరుకుంటున్నారు.
pakistan fans prayers for india loss
గ్రూప్-బీలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ, దాని నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడం కారణంగా మొత్తం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. నెదర్లాండ్స్ మాత్రమే ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా రేసులో ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు 8 పాయింట్లకు చేరుకోవడం విశేషం. మరోవైపు జింబాబ్వే కూడా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 7 పాయింట్లకు చేరుకోవచ్చు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.