
janaki gives warning to mallika for her fake pregnency
Janaki Kalaganaledu 31 Oct Today Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 31 అక్టోబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 421 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బారెడు పొద్దెక్కినా ఇంకా నిద్రపోతూ ఉంటాడు అఖిల్. అతడిని చూసి షాక్ అవుతుంది జానకి. వేరు పడాలనే ఆలోచన బాగానే ఉంది కానీ.. సోమరిపోతులా బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతున్నాడు అని వెళ్లి అతడిని లేపుతుంది. ఇంతలో జెస్సీ వస్తుంది. సోమరిపోతులా ఇప్పటిదాకా నిద్రపోతున్నావు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నీ మీద ఆధారపడిన వాళ్లు ఉన్నారు. అసలు నీ కెరీర్ గురించి ఏమైనా ఆలోచించావా లేదా అని క్లాస్ పీకుతుంది జానకి. జెస్సీ కూడా అక్క చెప్పేది విను అఖిల్ అంటుంది. ఎన్ని రోజులు బావ గారి మీద ఆధారపడతాం అంటుంది. ఆ తర్వాత జానకి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
janaki kalaganaledu 31 october 2022 full episode
వదినతో కంటిన్యూ అయిన ఈ నస.. జెస్సీ అలాగే కొనసాగిస్తుంది. ఎలాగైనా వీళ్ల నోర్లు మూయించాలి. చేస్తా.. ఎలాగైనా డబ్బు సంపాదించి వీళ్ల నోళ్లు మూయించేస్తా అని అనుకుంటాడు అఖిల్. మరోవైపు మల్లిక తన రూమ్ లో ఫోన్ లో పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉంటుంది. ఇంతలో జానకి తన రూమ్ వైపు రావడం చూసి షాక్ అవుతుంది. ఉక్రెయిన్ దేశంలోకి రష్యా అధ్యక్షుడు వచ్చినట్టు జానకి ఏంటి నా గదిలోకి వస్తోంది అని అనుకుంటుంది మల్లిక. ఏంటి జానకి ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఇందాక నువ్వు నీలావతి పిన్నితో ఏం మాట్లాడావో తెలుసుకుందాం అని వచ్చాను అంటుంది జానకి. దీంతో మల్లిక షాక్ అవుతుంది. శత్రు రాజ్యం రహస్యాలు గూఢచారి తెలుసుకున్నట్టు మేము మాట్లాడుకున్నది జానకి విన్నదా ఏంటి.. అని తన ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది.
మావి మాటలు కాదు జానకి. గోడు.. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లీలావతి పెద్దమ్మతో చెప్పుకున్నాను. నువ్వు తెలివైన దానివే కాదు.. పెద్ద జాదువువు కూడా. పోలేరమ్మను అడ్డం పెట్టుకొని మమ్మల్ని వేరు కాపురం పెట్టనీయకుండా అడ్డుకుంటున్నావు అని అంటుంది మల్లిక.
నాకు, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు స్వేచ్ఛ కావాలని నేను అనుకుంటుంటే.. నువ్వు మాత్రం నన్ను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నావు. ఈ కుటుంబానికి, నీకు నా ఉసురు, నా బిడ్డ ఉసురు తగలకుండా పోదు అని అంటుంది మల్లిక. దీంతో మల్లిక చెంప చెళ్లుమనిపిస్తుంది జానకి.
నేను కడుపుతో ఉన్నానన్న కనికరం కూడా లేకుండా నా మీద చేయి చేసుకుంటావా? నువ్వు నా తోటి కోడలువు అని మరిచిపోయావా? ఇప్పుడే అత్తయ్య గారికి చెబుతా.. ఇవాళ అటో ఇటో తేలాల్సిందే అని జ్ఞానాంబ దగ్గరికి వెళ్లబోతుండగా వెళ్లు వెళ్లు నీది కూడా ఫేక్ ప్రెగ్నెన్సీ అని చెబుతా అంటుంది జానకి.
దీంతో వెంటనే ఆగిపోతుంది మల్లిక. దీని వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి. అత్తయ్య గారి భావోద్వేగంతో ఆడుకుంటున్నావు. మామయ్య గారి సంతోషాన్ని వమ్ము చేశావు. అసలు నువ్వు అందరికీ పెద్ద ద్రోహం చేశావు. ఇంట్లో అందరి ఎమోషన్స్ తో ఆడుకుంటావా? చాలా పెద్ద తప్పు చేశావు మల్లిక అని క్లాస్ పీకుతుంది జానకి.
జానకి.. ఎంతైనా మనం ఇద్దరం తోడి కోడళ్లం. తోడపుట్టకపోయినా అక్కాచెళ్లెళ్లం. కాకపోతే ఇంకో చెంప మీద కూడా కొట్టు. ఎవ్వరికీ చెప్పొద్దు జానకి అంటూ వేడుకుంటుంది. దీంతో ఇప్పటికే నువ్వు చేసిన చిన్న చిన్న తప్పులను సమర్థించాను. దీనికి నీకు శిక్ష పడాల్సిందే. అత్తయ్య గారికి ఈ విషయం చెబుతాను అంటూ ఆవేశంతో వెళ్తుంది జానకి.
ఇప్పుడు పోలేరమ్మకు తెలిస్తే ఎలా అని అనుకుంటుంది మల్లిక. మరోవైపు అఖిల్ తన ఫ్రెండ్ ను కలుస్తాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్నావు కదా అని చెప్పి ఓ వ్యక్తిని పిలుస్తాడు తన ఫ్రెండ్.
వీడు కూడా మాల్ అమ్మి డబ్బులు సంపాదించుకుంటాడు అంటాడు. కానీ.. మాల్ అమ్మడం అంత ఈజీ కాదు. చాలా జాగ్రత్తగా మెయిన్ టెన్ చేయాలి. దొరికితే జీవితాంతం జైలుకే అంటాడు. దీంతో వామ్మో.. ఈపని నేను చేయను అంటాడు అఖిల్.
దీంతో తన ఫ్రెండ్ తనను ఒప్పిస్తాడు. నెల తిరిగే లోపు లక్షాధికారివి అవుతావు అంటూ ఆశ పెడతాడు. నేను ఉన్న సిచ్యుయేషన్ లో మనీ సంపాదించడం చాలా అవసరం. నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటాడు అఖిల్.
జాగ్రత్తగా చేస్తావా అంటాడు. అయితే.. అడ్వాన్స్ కింద ముందు మనీ తీసుకొని రా మాల్ ఇస్తాను అంటాడు. దీంతో ఎంత అంటాడు. 10 వేలు అనడంతో ఇప్పటికప్పుడు 10 వేలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకుంటాడు అఖిల్.
మరోవైపు మల్లిక టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నా బతుకు పోలేరమ్మ చేతిలో రబ్బరు బంతే అని భయపడుతూ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటుంది. లీలావతిని అడుగుదాం అని తనకు ఫోన్ చేస్తుంది మల్లిక.
కానీ.. తను ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇంతలో మల్లిక అని జ్ఞానాంబ పిలుస్తుంది. పక్కనే జానకి కూడా ఉంటుంది. ఇంతటితో నా జీవితం సమాప్తం అనుకుంటుంది మల్లిక. ఇంతలో ఇంట్లో వాళ్లంతా వస్తారు.
విష్ణు కూడా వస్తాడు. జానకి చెప్పింది నిజమేనా మల్లిక అని అడుగుతుంది జ్ఞానాంబ. ఏం చెప్పింది అత్తయ్య గారు అని అడుగుతుంది మల్లిక. దీంతో నువ్వు నిజంగా గర్భవతివి కావా అని అడుగుతుంది జ్ఞానాంబ.
కడుపుతో ఉన్నాను అని చెప్పి నువ్వు నాటకం ఆడావా అంటుంది జ్ఞానాంబ. నోరు తెరిచి చెప్పు అంటుంది. మా అందరినీ మోసం చేశావా అంటుంది జ్ఞానాంబ. మీరంటే నాకు ఎనలేని గౌరవం, భక్తి అత్తయ్య గారు. నేను మిమ్మల్ని మోసం చేస్తానా అత్తయ్య గారు అంటుంది మల్లిక.
జానకే కావాలని నా మీద లేనిపోనివి కల్పించి చెబుతోంది అత్తయ్య గారు అంటుంది మల్లిక. జానకి కల్పించి చెబుతోందో, నీది కట్టుకథో హాస్పిటల్ కు వెళ్తే తెలుస్తుంది కదా అంటుంది జ్ఞానాంబ.
లేదంటే లీలావతికి ఫోన్ చేస్తే చాలు అన్నీ బయటపడతాయి కదా అంటుంది జానకి. దీంతో వద్దు నేనే చెప్తా అని ముందు కడుపు వచ్చింది అనుకున్నా కానీ.. తర్వాత రాలేదు అని అంటుంది. దీంతో విష్ణు తనను ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. మీ అమ్మానాన్నను తీసుకొనిరా అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్‌సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.