Pakistan : మొన్న ఇండియా గెల‌వాల‌ని కోరుకున్న పాక్ ఇప్పుడు ఓడిపోవాల‌ని కోరుకుంటుందా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pakistan : మొన్న ఇండియా గెల‌వాల‌ని కోరుకున్న పాక్ ఇప్పుడు ఓడిపోవాల‌ని కోరుకుంటుందా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 October 2022,10:40 am

Pakistan: ప్ర‌స్తుతం టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ రంజుగా సాగుతుంది. గ్రూప్ ఏలో భార‌త్ ఉండ‌గా, ఈ టీం తొలి ప‌రాజ‌యాన్ని చ‌వి చూసింది. ఆదివారం పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఆఫ్రికన్ జట్టుకు 134 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన టీమ్ ఇండియా.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఓడిపోయింది. భారత్ తమ గత మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, నెదర్లాండ్‌లను ఓడించింది. దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఓటమి తర్వాత గ్రూప్ బి పాయింట్ల పట్టికలో భారీ మార్పు చోటు చేసుకున్నాయి.

ద‌క్షిణాఫ్రికా ఓడితే పాక్‌కి సెమీస్ అవ‌కాశాలు చాలా ఉండేవి. అందుకే ఈ మ్యాచ్‌లో భార‌త్ గెల‌వాల‌ని పాక్ క్రికెట‌ర్స్, అభిమానులు ఎంత‌గానో కోరుకున్నారు. కాని వారి పూజ‌లు ఫ‌లించ‌లేదు. ఇప్పుడు భార‌త్ ఓట‌మి చెందాల‌ని కోరుకుంటున్నారు. దాదాపు ద‌క్షిణాఫ్రికా సెమీస్‌కి వెళ్లే ఛాన్స్ ఉన్న నేప‌థ్యంలో భార‌త్ ఓట‌మి పాక్‌కి క‌లిసి వ‌చ్చేలా క‌నిపిస్తుంది. పాక్ రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండ‌గా, ఆ రెండు గెలిస్తే ఆరు పాయింట్స్ వ‌స్తాయి.భార‌త్ ఒక మ్యాచ్ ఒడిపోతే ఆరు పాయింట్స్ ఉంటాయి. అప్ప‌డు ర‌న్ రేట్ కీల‌క‌గా మార‌నుంది. ఆ ర‌కంగా పాక్‌కి ఏమైన అవ‌కాశం ఉంటుందేమోన‌ని పాక్ అభిమానులు భార‌త్ ఓట‌మిని కోరుకుంటున్నారు.

pakistan fans prayers for india loss

pakistan fans prayers for india loss

Pakistan ట‌ఫ్ పైట్..

గ్రూప్-బీలో బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. ఇది ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించింది. బంగ్లాదేశ్‌కు కూడా నాలుగు పాయింట్లు ఉన్నాయి. కానీ, దాని నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. జింబాబ్వే జట్టు మూడు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమి, ఒక మ్యాచ్ రద్దు కావడం కారణంగా మొత్తం మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు పాక్ జట్టు రెండు పాయింట్లతో ఐదో స్థానంలో, నెదర్లాండ్స్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. నెదర్లాండ్స్ మాత్రమే ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓడి సెమీ-ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు కూడా రేసులో ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా బంగ్లాదేశ్ జట్టు 8 పాయింట్లకు చేరుకోవడం విశేషం. మరోవైపు జింబాబ్వే కూడా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 7 పాయింట్లకు చేరుకోవచ్చు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది