
Pakistan : పాకిస్తాన్‌ని వరుణుడు కూడా కాపాడలేకపోయాడుగా.. సొంత టీమ్‌ని దారుణంగా తిడుతున్నారేంటి?
Pakistan : మొన్నటి వరకు ఐపీఎల్ మంచి మజా అందించగా, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా సాగుతుంది. అయితే భారీ అంచనాలతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్‌లోకి అడుగుపెట్టగా, వర్షం పాకిస్థాన్ కొంప ముంచింది. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా యూఎస్ఏ, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కనీసం టాస్ కూడా పడకుండా రద్దవడంతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉండగానే పాకిస్థాన్ ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచ్ రద్దవడంతో యూఎస్ఏకు ఒక పాయింట్ లభించింది. దీంతో ఐదు పాయింట్లతో ఆ టీమ్ ఆడిన తొలి టీ20 వరల్డ్ కప్ లోనే సూపర్ 8 స్టేజ్ కు వెళ్లి సంచలనం సృష్టించింది.పాకిస్థాన్ ఈ మెగా టోర్నీలో యూఎస్ఏ, ఇండియా చేతుల్లో ఓడినా.. కెనడాపై గెలిచి సూపర్ 8 ఆశలను సజీవంగా ఉంచుకుంది.
శుక్రవారం (జూన్ 14) ఐర్లాండ్ చేతుల్లో యూఎస్ఏ ఓడిపోవాలని బలంగా కోరుకుంది. తర్వాత ఆదివారం (జూన్ 16) అదే ఐర్లాండ్ ను ఓడించి సూపర్ 8కు వెళ్లాలని ఆశపడింది. కానీ ఫ్లోరిడాలోని లాండర్‌హిల్ లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు పాకిస్థాన్ కొంప ముంచాయి. తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడకముందే పాకిస్థాన్ ఇంటికెళ్లిపోవడం ఖాయమైంది. 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఆ టీమ్.. ఈసారి కనీసం సూపర్ 8 చేరుకోలేకపోయింది. యూఎస్ఏతో జరిగిన తొలి మ్యాచ్ లోనే ఆ టీమ్ సూపర్ ఓవర్లో ఓడింది. తర్వాత ఇండియా చేతుల్లో ఆరు పరుగులతో పరాజయం పాలైంది. కెనడాపై సులువుగానే గెలిచినా ఫలితం లేకుండా పోయింది.
మ్యాచ్‌లు ముగుస్తున్న కొద్ది టీ20 వరల్డ్ కప్ లో పలు సూపర్ 8 బెర్తులు ఖాయం అవుతున్నాయి. వాటిలో గ్రూప్ ఎ నుంచి ఇండియా, యూఎస్ఏ.. గ్రూప్ బి నుంచి ఆస్ట్రేలియా.. గ్రూప్ సి నుంచి వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్.. గ్రూప్ డి నుంచి సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సూపర్ 8 చేరుకున్నాయి. గ్రూప్ బిలో సూపర్ 8 బెర్తు కోసం ఇంగ్లండ్, స్కాట్లాండ్ పోటీ పడుతున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరు సూపర్ 8 చేరుతారన్నది ఆదివారం (జూన్ 16) తేలనుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.