Hardik Pandya : డబ్బు కోసం ఇంతలా దిగజారాలా... ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై సంచలన వ్యాఖ్యలు....!
Hardik Pandya : టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి మనందరికీ తెలిసిందే. ఎన్నో సందర్భాలలో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు అండగా నిలిచి విజయానికి పునాది అయ్యాడు. అయితే హార్దిక్ పాండ్య పై అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. హార్దిక్ పాండ్యా తీసుకునే కొన్ని నిర్ణయాలు తన అభిమానులను సైతం నిరాశపరిచేలా ఉంటాయి. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా ను ఉద్దేశించి పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మాజీ ఫేసర్ ప్రవీణ్ కుమార్ హార్దిక్ పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మరియు దేశవాళీ క్రికెట్ ఆడకుండానే హార్దిక్ పాండ్యా నేరుగా ఐపిఎల్ 2024 సీజన్ ఆడేందుకు సిద్ధం అవుతున్నాడని తప్పుపట్టారు. అంతేకాక ఇప్పుడు హార్దిక్ పాండ్యా ప్రాంచేజీ మారడాన్ని కూడా ప్రవీణ్ కుమార్ విమర్శించడం జరిగింది. డబ్బులు కోసం మరీ ఇంతలా దిగజారాలా అంటూ హార్దిక్ పాండ్యా పై ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
అయితే వన్డే ప్రపంచ కప్ 2023లో జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్ లో గాయానికి గురైన హార్దిక్ పాండ్యా ఆ టోర్నీ నుంచి ఉన్నపలంగా తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక అప్పటినుండి హార్దిక్ పాండ్యా మళ్ళీ మైదానంలోకి అడుగు పెట్టింది లేదు. కానీ ఐపీఎల్ ఆడెందుకు హార్దిక్ తీవ్రంగా శ్రమించాడు అని చెప్పాలి. గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్స్ చేశాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉన్న హార్థిక్ పాండ్యాను క్యాష్ ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాక హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించారు. అయితే హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకువచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చినట్లుగా ప్రచారాలు కూడా జరిగాయి.
అయితే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయం తర్వాత అంతర్జాతీయ మరియు దేశ వాలి క్రికెట్ కు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 సీజన్ తో తిరిగి రీఎంట్రీ ఇవ్వనున్నారు.ఇక ఇదే ఈ విషయాన్ని తాజాగా ప్రవీణ్ కుమార్ ప్రస్తావిస్తూ హార్దిక్ పాండ్యా పై విమర్శలు చేశారు. ఐపీఎల్ కు రెండు నెలల ముందు గాయపడ్డ హార్దిక్ పాండ్యా అప్పటినుండి దేశం తరఫున ఆడింది లేదు.అదేవిధంగా దేశవాళి క్రికెట్ లో కూడా తన సొంత రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించలేదు. కానీ ఇప్పుడు నేరుగా ఐపిఎల్ ఆడెందుకు మాత్రం సిద్ధమవుతున్నాడు అలా ఎలా సాధ్యమవుతుందో..అంటూ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేయసాగాడు. డబ్బు సంపాదించడంలో ఎలాంటి తప్పులేదు కానీ రాష్ట్రం తో పాటు తన దేశం తరఫున కూడా ఆడాలి కదా..?ప్రస్తుతం ఉన్న చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్ కు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ ను నడిపించే సత్తా రోహిత్ శర్మకు ఉంటుంది. మరో రెండేళ్లు అయినా సరే ముంబై ఇండియన్స్ కి రోహిత్ శర్మ సారథ్యం వహించగలరు. కానీ కెప్టెన్సీ మార్పు అనేది మేనేజ్మెంట్ చేతిలో ఉండే విషయమని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.