Home » Exclusive » Rishabh Pant Punch To Urvashi Rautela
Exclusive

Rishabh Pant : బాలీవుడ్ హీరోయిన్‌కి రిష‌బ్ పంత్ ఇచ్చిన పంచ్ మాములుగా లేదుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 11, 2022, 8:40 pm
Advertisement

Rishabh Pant : ఇటీవ‌ల ప్రేమ వ్య‌వ‌హారాల గురించి అనేక క‌థ‌నాలు వింటున్నాం. చిత్ర పరిశ్రమకు చెందినవారినే కాకుండా క్రికెటర్లు, వ్యాపారవేత్తలతో డేటింగ్‌ చేసి తర్వాత పెళ్లీ పీటలు ఎక్కిన హీరోయిన్లను కూడా చూశాం. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, భారత క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై వారిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఊర్వశి రౌతేలా కోసం రిషబ్‌ పంత్‌ ఎయిర్‌ పోర్ట్‌లో 16 గంటల పాటు ఎదురుచూశాడంటూ కొన్ని కథనాలు వచ్చాయి.

Advertisement

తాజాగా ఒక ఇంటర్య్వూలో పాల్గొన్న ఊర్వశి రౌతేలా పంత్‌తో ప్రేమ వ్యవహారంపై కామెంట్స్‌ చేసింది. తనను ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడని.. నేనంటే పడి చచ్చిపోతున్నాడంటూ.. నన్ను కలవడానికి వెయిట్‌ చేస్తున్నాడని… అతని పేరు చెప్పను గానీ షార్ట్‌ఫామ్‌లో మాత్రం ”ఆర్‌పీ” అని పేర్కొంది. ”ఆర్‌పీ” అంటే కచ్చితంగా రిషబ్‌ పంత్‌ అయి ఉంటాడని చెవులు కొరుక్కున్నారు. ఇది మ‌రింత బ‌లాన్ని చేకూర్చేలా.. ఊర్వ‌శి మాట్లాడుతూ.. ”గతంలో నేను వారణాసిలో షూటింగ్‌ ముగించుకొని ఒక షో కోసం ఢిల్లీ వెళ్లాను. అక్కడ దాదాపు 10 గంటల పాటు షూటింగ్‌ జరిగింది. దీంతో చాలా అలిసిపోయి ఇంటికెళ్లాను. ఈ సమయంలో నా ఫోన్‌కు చాలా కాల్స్‌ వచ్చాయి. కానీ ఫోన్‌ లేపలేకపోయా. లేచి చూస్తే దాదాపు 16-17 మిస్‌డ్‌ కాల్స్‌ ఉన్నాయి”

Rishabh Pant Punch to Urvashi Rautela

Advertisement

Rishabh Pant : ఏం జ‌రుగుతుంది?

అంటూ బాలీవుడ్‌ హంగామాకు ఇచ్చిన ఇంటర్య్వూలో పేర్కొంది.ఈ క్రమంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్‌ చేస్తూ బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా పేరును ఎక్కడా ప్రస్తావించకుండా తనదైన శైలిలో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ”ఇంటర్య్వూల్లో కొంతమంది తమ పేరు, ప్రఖ్యాతల కోసం నీచంగా దిగజారుతుంటారు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తోంది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి వ్యక్తులను ఇబ్బందుల్లో పడేస్తుంటారు. దేవుడు వారిపై కాస్త కరుణ చూపించాలి..  ప్లీజ్‌ అక్క.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. అబద్దాలు ఆడడానికైనా ఒక లిమిట్‌ ఉంటుంది” అంటూ కాప్షన్‌ జత చేశాడు. దీనిపై ఊర్వ‌శి ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి