Home » Exclusive » Rohit Sharma And Shubman Gill Hundreds In India Vs England Test Match
Exclusive

India vs England : సెంచరీలతో చెలరేగిపోతున్న రోహిత్ శర్మ , గిల్.. భారీ స్కోర్ సాధించిన భారత్…!

Authored By
Ramu
The Telugu News | Published on: March 8, 2024, 3:00 pm
Advertisement

India vs England : ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ లో India vs England  5th Test Match టీమిండియా బ్యాటర్లు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఓవర్ నైట్ స్కోర్ 135/1 తో రెండవ రోజు ఆటను ప్రారంభించిన టీం ఇండియా ఇంగ్లాండ్ పై పూర్తి ఆధిపత్యం చెల ఇస్తుంది. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ Rohit sharma మరియు వన్ డౌన్ బ్యాటర్ సుబ్ మాన్ గిల్ shubman gill శరవేగంగా పరుగులు రాబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురు సెంచరీలను కూడా పూర్తి చేసుకున్నారు. అయితే మొదట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయగా ఆ తర్వాత మరో రెండు బంతులకే సుబ్ మన్ గిల్ కూడా సెంచరీ సాధించాడు.

Advertisement

అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు 218 పరుగులకు ఆల్ అవుట్ కాగా భారత్ ఇప్పటికే ఆ స్కోర్ ను దాటి భారీ స్కోర్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇక మ్యాచ్ తొలి రోజే ఆఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ రెండో రోజు కూడా అదే జోరును కనబరుస్తున్నారు. అదేవిధంగా యంగ్ ప్లేయర్ సుబ్ మన్ గిల్ సైతం రోహిత్ తో పోటీ పడుతూ పరుగులు సాధిస్తున్నాడు.

ఈ క్రమంలోనే తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేయగా యంగ్ ప్లేయర్ సుబ్ మన్ గిల్ ఆ తర్వాతి రెండు బంతులకే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు మధ్యాహ్న సమయానికిి టీం ఇండియా 264/1 స్కోరు సాధించింది. అయితే టీమిండియా ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ చేసిన స్కోర్ దాటేసి 46 పరుగులు ఆదిక్యంలో కొనసాగుతుంది. ఇక రెండవ రోజు తొలి సేషన్ లో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 126 పరుగులు సాధించింది

Ramu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి