
sachin : క్రికెట్ ప్రపంచంలో సచిన్ పేరు చెబితే చాలు, ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తాయి. బ్యాట్ చేతపట్టి గ్రౌండ్‌లోకి సచిన్ వస్తున్నాడంటే చాలు.. ఫ్యాన్స్ ఈలలు, చప్పట్లతో స్టేడియాన్ని మోత మోగిస్తారు. అయితే సచిన్ క్రికెట్‌కు ఎప్పుడో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినా పలు ప్రత్యేక సిరీస్‌లో అప్పుడప్పుడూ ఆడుతూ కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సచిన్ మరోసారి అలాంటి ఓ ప్రత్యేక సిరీస్ కోసం మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తున్నాడు.
sachin batting practice again in nets watch viral video
ది రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ పేరిట రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమ నిబంధనలపై వాహనదారులు, పాదచారులకు అవగాహన కల్పించడం కోసం గతంలో పలు ప్రత్యేక క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించారు. అయితే కరోనా వల్ల గతేడాది జరగాల్సిన ఈ సిరీస్ మ్యాచ్‌లు 4 ఆగిపోయాయి. ఈ క్రమంలో త్వరలోనే మిగిలిన ఆ నాలుగు మ్యాచ్‌లను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ అనే టీమ్‌కు సచిన్ నాయకత్వం వహిస్తున్నాడు. అందులో భాగంగానే ఆ మ్యాచ్‌లలో ఆడేందుకు సచిన్ మళ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
సచిన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో సచిన్ క్లాసిక్ షాట్స్ ఆడుతుండడాన్ని గమనించవచ్చు. క్రికెట్ ప్రపంచంలో సచిన్‌ను దేవుడిగా ఫ్యాన్స్ అభివర్ణిస్తారు. మాస్టర్ షాట్స్, మాస్టర్ క్లాసిక్ షాట్స్ అనేవి సచిన్ ఆడిన షాట్స్ నుంచే వచ్చాయి. ఎంతటి కఠినమైన బంతిని అయినా సరే బౌండరీ తరలించగల దిట్టల్లో సచిన్ ఒకడు. సచిన్ క్రికెట్ ఆడుతుంటే పలు షాట్స్‌ను చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఈ క్రమంలోనే సచిన్ మళ్లీ బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేస్తుండడాన్ని వీడియోలో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.