Shubman Gill : సెంచరీతో అదరగొట్టిన శుభమన్‌గిల్‌కి సచిన్ అవార్డ్ ఇవ్వకపోవడం వెనక కారణం ఇదేనా.. వీడియో
Shubman Gill ; ఇటీవల కాలంలో టీమిండియాలో ఓ యువ బ్యాట్స్‌మెన్ ఏ ఫార్మాట్ అయిన తన సత్తా చూపుతూ అదరగొడుతున్నాడు. అతను మరెవరో కాదు శుభమన్ గిల్. టీ 20లలో గిల్ ఆటతీరుపై కొన్నాళ్లుగా విమర్శలు వచ్చాయి. అతని ఆట పొట్టి ఫార్మాట్‌కు సరిపోదని కొందరు విమర్శలు గుప్పించారు. అతన్ని జట్టులో నుంచి తీసేయాలని మరికొందరు సలహా ఇచ్చారు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రం తన ఓపెనర్లపై నమ్మకం ఉంచి సిరీస్ డిసైడర్‌లో కూడా శుభ్‌మన్ గిల్ కి అవకాశం ఇచ్చాడు. దాంతో అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టీ20 ఫార్మాట్లో సెంచరీ సాధించిన యువప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అదే కారణమా?
122 పరుగులతో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బద్దుటు కొట్టి సరికొత్త రికార్డ్ సృష్టించాడు శుభమన్ గిల్ . ఈ బ్యాట్స్‌మెన్ న్యూజిలాండ్ బౌలర్స్ కి చుక్కలు చూపించాడు. 52 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్న గిల్.. మొత్తంగా 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 126 పరుగుల చేసి నాటౌట్‌గా ఉన్నాడు. గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. మొదట్లో చాలా స్లో ఆడిన గిల్ తర్వాత గేర్ మార్చాడు. దాంతో టీ 20లో తొలి సెంచరీ చేశాడు. ఈ సిరీస్ కంటే ముందు న్యూజిలాండ్‌పైనే వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన గిల్.. ఇప్పుడు టీ20ల్లోనూ సెంచరీ చేసి.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆటగాడిగా అద్భుతం సృష్టించాడు.
అయితే డిసైడర్ మ్యాచ్ లో అండర్ 19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఉమెన్స్ టీమ్‌ను సన్మానించేందుకు సచిన్ టెండూల్కర్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి హాజరయ్యారు.. అండర్ 19 ఉమెన్స్ టీమ్‌కు నగదు పురస్కారం అందించి.. వారి విజయం గురించి మాట్లాడారు. ఇక భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వారికి సచిన్ చేతుల మీదుగా అవార్డ్ అందించడం జరుగుతుందని అనుకున్నారు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సచిన్ చేతుల మీదుగా శుభమన్ గిల్ అందుకోవడం ఖాయమని అంతా భావించారు. కాని అది జరగలేదు. అందుకు కారణం సచిన్ కూతురు సారాతో శుబ్‌మన్ సీక్రెట్ ప్రేమాయణం నడపడమని కొందరు ముచ్చటించుకుంటున్నారు.
???????????????????????????????????????????????????????????? ???????? ???????????? ???????????????????? ????????????????????????????????????!
Bharat Ratna Shri @sachin_rt and Office Bearers of BCCI honour the achievements of the World Cup-winning India U19 team and present them with a cheque of INR 5 crore. ???????? #TeamIndia @JayShah pic.twitter.com/u13tWMPhLQ
— BCCI (@BCCI) February 1, 2023