
Sachin Tendulkar revels why he recommended Ms dhoni name
Sachin Tendulkar : భారత్ క్రికెట్,Indian Cricket, చరిత్రలో సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, Sachin Tendulkar, Mahendra Singh Dhoni, స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరి ఆట తీరు వారిదే. అయితే తాజాగా ధోనిపై సచిన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనే విషయం మనందరి తెలిసిందే. 2007-2017 మధ్య కాలంలో టీమిండియా,Team India, కు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని అన్ని ఫార్మాట్లలో ఐఐసీ ట్రోఫీని అందుకున్న ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. 2007లో తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను అందుకున్న ధోని 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను కూడా అందుకున్నాడు.
అయితే టీమిండియా కెప్టెన్‌గా ధోని బాధ్యతలు స్వీకరించే నాటికిఅప్పటి జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఉన్నా కూడా ధోనికి బాధ్యతలు ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ధోని భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనప్పుడు వికెట్ కీపర్-బ్యాటర్ వయసు 26. అయితే అంత చిన్న వయస్సులో ధోనికి కెప్టెన్సీ అప్పగించడంపై వెనుక ఉన్నది సచిన్ టెండూల్కర్ అట. ఇన్ఫోసిస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ ధోనిని కెప్టెన్‌గా చెయ్యాలని బీసీసీఐని ఎందుకు కోరాడో చెప్పుకొచ్చాడు. “నాకు కెప్టెన్సీ ఆఫర్ వచ్చినప్పుడు అప్పుడు మేము ఇంగ్లాండ్‌లో ఉన్నాం. అప్పుడే జట్టులో జూనియర్లలో ఒక మంచి లీడర్ ఉన్నాడని, అతన్ని జాగ్రత్తగా గమనించాలని చెప్పానే. భవిష్యత్తులో మంచి సారధి అయ్యే సత్తా అతనికి ఉందని కూడా చెప్పాను.
Sachin Tendulkar revels why he recommended Ms dhoni name
ధోనీతో నేను చాలా మాట్లాడేవాడిని. స్లిప్స్‌లో ఉండగా కెప్టెన్ రాహుల్ ద్రావిడ్,Rahul Dravid, అయినా కూడా ధోనీతోనే ఎక్కువ మాట్లాడేవాడిని. అతను చాలా ప్రశాంతంగా మంచి పాయింట్స్ చెప్పేవాడు’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. జోష్ సే నహీ, హోష్ సే ఖేలో (జోష్‌తో కాదు, తెలివిగా ఆడాలి) అని క్రికెట్‌లో చెబుతుంటాం. పది బంతుల్లో పది వికెట్లు తీయడం కుదరదు కాని దాని కోసం చాలా ప్లాన్ చేయాలి. రోజు చివరకు స్కోర్‌బోర్డులో ఏముందనేది కదా ముఖ్యం. ఆ లక్షణాలన్నీ ధోనీలో కనిపించడంతో అతని పేరు సూచించా’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. కాగా, ధోనీ కెప్టెన్సీలో భారత్ 2011 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకున్న టీమ్‌లో టెండూల్కర్ కూడా సభ్యుడు కాగా, 2013లో ముంబైలో తన చివరి టెస్ట్‌ను కూడా ధోనీ నాయకత్వంలోనే ఆడి ఆట నుండి రిటైర్ అయిన విషయం విదితమే.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.