ICC World Cup 2023 : ప్రస్తుతం ప్రపంచమంతా రేపటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. అదే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా. అసలే ఆదివారం.. ఇక క్రికెట్ మ్యాచ్. అది కూడా వన్డ్ క్రికెట్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి. రచ్చ రంబోలానే కదా. అది కూడా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా అంటే రెండు దిగ్గజ టీమ్ ల మధ్య పోటీ అంటే మామూలుగా ఉండదు. అందుకే ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని ఆ మ్యాచ్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాడు. అయితే.. ఆ మ్యాచ్ కి శుభ్ మన్ గిల్ దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఎందుకంటే.. శుభ్ మన్ కి డెంగ్యూ రావడంతో ఓపెనర్, ఆల్ రౌండర్ శుభ్ మన్ తొలి మ్యాచ్ కే దూరం అవుతాడని అంతా అనుకున్నారు. కానీ.. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఒక గుడ్ న్యూస్ చెప్పాడు.
డెంగ్యూ బారిన పడ్డ ఓపెన్ శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఫిట్ గానే ఉన్నాడని గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మ్యాచ్ కి ఇంకా సమయం ఉండటంతో శుభ్ మన్ గిల్ వన్డే వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో ఉండే చాన్స్ ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. డెంగ్యూ రావడంతో శుభ్ మన్ గిల్ ప్రాక్టీస్ సెషన్స్ లోనూ పాల్గొనలేదు. దీంతో శుభ్ మన్ గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ను తీసుకుంటారని అనుకున్నారు. నిజానికి శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. ఓపెనర్ గా శుభ్ మన్ అయితే పరుగుల వరద సృష్టించడం ఖాయం. అందుకే.. శుభ్ మన్ ను ఓపెనర్ గా పంపించాలని టీమిండియా భావిస్తోంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన రాహుల్ ద్రవిడ్.. శుభ్ మన్ గిల్ ఆరోగ్యంగానే ఉన్నాడని.. మ్యాచ్ కు ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకు శుభ్ మన్ గిల్ కోలుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. మ్యాచ్ సమయానికి పూర్తిగా కోలుకొని మ్యాచ్ ఆడుతాడనే ఆశాభావం వ్యక్తం చేశారు రాహుల్. మరోవైపు మ్యాచ్ కోసం ప్లేయర్స్ అంతా సిద్ధంగా ఉన్నారని.. చెన్నై పిచ్ ను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తున్నామని రాహుల్ స్పష్టం చేశాడు.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.