
#image_title
Roja VS Bandaru : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ మీద ఉన్న చర్చ కాస్త దారి తప్పి ఏకంగా రోజా మీదికి వెళ్లింది. మంత్రి రోజా.. చంద్రబాబు అరెస్ట్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం, బాలకృష్ణ, భువనేశ్వరి, బ్రాహ్మణిలపై కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి.. రోజాపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. రోజా.. నీ గురించి ఎవరికి తెలియదు. నువ్వేంటో.. నీ బతుకేంటో అందరికీ తెలుసు. నువ్వు మాకు నీతులు చెబుతున్నావా.. నువ్వు ఆ సినిమాల్లో నటించింది నిజం కాదా? ఆ సీడీలన్నీ బయటపెడతా అంటూ బండారు సత్యనారాయణ రోజాపై రెచ్చిపోయారు. అసలు రోజా అలాంటి సినిమాల్లో నటించిందా? మరీ అంత దారుణంగా ఒక మహిళ గురించి అలా మాట్లాడుతారా ఎవరైనా అంటూ పలువురు బండారు వ్యాఖ్యలను వ్యతిరేకించారు.
రోజా కూడా బండారు వ్యాఖ్యలపై స్పందించి ఆయనపై కేసు నమోదు చేయడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ కూడా వచ్చింది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే అయినప్పటికీ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం అనేది కరెక్ట్ కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలా అయితే మహిళలు రాజకీయాల్లో రాణించడం కరెక్టేనా? కొత్త తరం మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడే పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా రోజా విషయంపై తన కూతురు కూడా స్పందించినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మను ఇప్పుడు ఇలా చూస్తే ఏడుపొస్తుంది. తన తల్లిని వదిలేయండి.. అంటూ కుటుంబ సభ్యుల ముందు వాపోయిందట రోజా కూతురు. నేను చిన్నపిల్లను.. అమ్మను ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు ఎప్పుడూ అమ్మను అలా చూడలేదు. అమ్మ అలా దిగులుగా ఉంటే నాకు భోజనం కూడా తినాలనిపించడం లేదు.. అంటూ రోజా కూతురు వాపోయినట్టు తెలుస్తోంది.
#image_title
అయితే.. ఈ విషయంపై రోజా భర్త కూడా స్పందించారు. ఆయన ఘాటుగానే స్పందించారు. ఇప్పటికీ పలువురు సినీ నటులు రోజాకు అండగా నిలబడి సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని చెప్పారు. నటి ఖుష్బూ, నటి రాధిక.. రోజాకు మద్దతు పలికారు. రోజాకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. తాజాగా రోజా కూతురు చేసిన కామెంట్స్ పై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.