Virat Kohli : విరాట్ కోహ్లీ అంటే ఇష్టమంటూనే చురకలు అంటించిన సౌరవ్ గంగూలీ.. ఏమన్నాడంటే?

Authored By mallesh | The Telugu News | Published on: December 20, 2021, 9:50 am

Virat Kohli : టీమిండియా మాజీ కెప్టెన్, ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పొగుడుతూనే చురకలు అంటించారు. టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీని వన్డే ఫార్మాట్‌ నాయకత్వం నుంచి కూడా తొలగిస్తూ బీసీసీఐ డెసిషన్ తీసుకుంది. ఈ విషయమై ప్రకటించింది కూడా. కాగా, విరాట్ కోహ్లీకి ఈ తొలగింపు విషయం చాలా కాలం ముందరే చెప్పామని సౌరవ్ గంగూలీ అంటున్నారు. కానీ, తనకు ఒక గంటన్నర ముందరే విషయాన్ని చెప్పారని కోహ్లీ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. గంగూలీ ఈ విషయాన్ని వదిలేయాలని పేర్కొంటున్నారు.

కానీ, ప్రస్తుతం హాట్ టాపిక్ ప్లస్ చర్చనీయాంశంగా అదే ఉంది.విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా వారు సౌరవ్ గంగూలీని ఎక్కడికెళ్లినా అడుగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గురుగావ్‌లో జరిగిన ఈవెంట్‌లో గంగూలీ కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంగూలీకి ఏ ప్లేయర్ యాటిట్యూడ్ ఇష్టమని ఓ విలేకరి అడగగా, తనకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ ఇష్టమని తెలిపారు. కానీ, తాను చాలా సేపు ఫైట్ చేయడం మాత్రం తనకు నచ్చదని గంగూలీ తెలిపాడు. అలా విరాట్ కోహ్లీని ఓ వైపున పొగుడుతూనే మరో వైపున తెగుడుతున్నాడు. తన జీవితంలో స్ట్రెస్‌ను ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్నకు కూడా సౌరవ్ గంగూలీ సెటైరికల్ రిప్లయి ఇచ్చారు.

Sourav Ganguly comments on virat kohli

Sourav Ganguly comments on virat kohli

Virat Kohli : తనకు విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ ఇష్టమన్న గంగూలీ..

తన లైఫ్‌లో ప్రెషర్ అనేది అస్సలు ఉండబోదని, కేవలం వైఫ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే ప్రెషర్ ఇస్తుంటారని పేర్కొన్నాడు గంగూలీ. ఇకపోతే సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య జరుగుతున్న వ్యాఖ్యలు చూస్తుంటే భారత క్రికెట్‌లో ఇంతకీ ఏం జరుగుతుంది అనే చర్చ క్రీడా, క్రికెట్ అభిమానులలో బయలుదేరుతోంది. గంగూలీ వ్యాఖ్యలకు భిన్నంగా విరాట్ కోహ్లీ వ్యాఖ్యలు ఉండటం మూలాన ఈ చర్చ జరుగుతున్నది. ఇకపోతే తనకు రోహిత్ శర్మతో ఎటువంటి విభేదాలు లేవని ఇటీవల విరాట్ కోహ్లీ స్పష్టంగా తెలిపాడు.

mallesh

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp