Suryakumar Yadav : టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆయన వరల్డ్ కప్‌లో కూడా కొన్ని మంచి నాక్స్ ఆడాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ 20లో అద్భుతమైన సెంచరీ చేశాడు. మొదటి బంతి నుండి సూర్య తనదైన శైలిలో విరుచుకు పడడంతో 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 111 సాధించి ఔరా అనిపించాడు. ఇక 49 బంతుల్లోనే సెంచరీ సాధించి బౌలర్లను బెంబేలెత్తించిన సూర్య మైదాన్యంచుట్టు పక్కల షాట్స్ ఆడాడు. రెండో టీ 20లో సూర్య తప్ప మంచి ఇన్నింగ్స్ ఎవరు ఆడలేదు. అయితే ఈ మ్యాచ్ అమెజాన్ ప్రైమ్ లోనే ప్రసారం కావడంతో క్రికెట్ ప్రేమికులకి చూసే అవకాశం లేకపోయింది.
సూర్య షాట్స్‌ని చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్న నేపథ్యంలో సూర్యకుమార్ షాట్స్‌కి సంబంధించిన వీడియోను అమెజాన్ ప్రైమ్, బీటీ స్పోర్ట్స్ యూ ట్యూబ్ ల్లో ప్రసారం చేశాయి. దీంతో సూర్య ఆటతీరును చూసి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బాల్ అయినా సూర్య ఎదుర్కోవడాన్ని చూసి అందరు సంబరపడ్డారు. ఒక్కో బంతిని ఒక్కో స్టైల్ లో బాదుతూ అలరించాడు సూర్య. ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉండగా.. హార్దిక్ పాండ్యా జట్టును నడిపిస్తున్న విషయం తెలిసిందే. కుర్రాళ్లందరు ఈ సిరీస్ ఆడుతుండగా,
వారిలో సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 111 నాటౌట్) మాత్రం సూపర్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అద్భుత బ్యాటింగ్‌తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ ప్రశంసిస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా ఆసక్తికరంగా స్పందించాడు. ‘‘ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్.. ప్రపంచంలో అతనెందుకు అయ్యాడో చూపిస్తున్నాడు. నాకైతే లైవ్ చూసినట్టు లేదు. అతడాడిన మరో వీడియో గేమ్ ఇది’’ అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సాహంగాతమ స్పందన తెలియజేస్తున్నారు. కాగా ఇటివలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ద్వయం చెలరేగి ఆడింది మనం చూసాం.. భారత్ సెమీస్ చేరడంలో వీరిద్దరు తమవంతు సహకారం అందించిన విషయం తెలిసిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.