#image_title
ICC World Cup 2023 : మీకు 2011 ఐసీసీ వరల్డ్ కప్ గుర్తుందా? ఆ వరల్డ్ కప్ ను ధోనీ సారథ్యంలో మనమే గెలిచాం. కానీ.. ఆ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ మనకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే.. 2013 లో మళ్లీ ధోనీ సారథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ ట్రోఫీలను టీమిండియా గెలుచుకోలేదు. కానీ.. తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అది కూడా భారత్ లో ఈసారి వరల్డ్ కప్ జరుగుతోంది. అంటే.. ఈసారి టైటిల్ ఫేవరేట్ భారత్ అన్నమాట. ఈసారి 10 జట్లు.. చివరకు నెగ్గేది ఒక్క జట్టు మాత్రమే. 150 మంది ఆటగాళ్లు ఈసారి వరల్డ్ కప్ లో తమ సత్తా చాటడానికి రెడీ అయ్యారు. అయితే.. టీమిండియా 2013 తర్వాత నాకౌట్ దశ వరకు వెళ్తోంది కానీ.. కప్ మాత్రం గెలవలేకపోతోంది. ఒక్క వన్డే వరల్డ్ కప్ లోనే కాదు.. చాలా టోర్నీలలో టీమిండియా పరిస్థితి ఇదే.
2014 లో టీ20 వరల్డ్ కప్ ను ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయి వచ్చింది టీమిండియా. ఆ తర్వాత 2016 టీ20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైన్స్ వరకు వెళ్లింది. ఇక టెస్ట్ చాంపియన్ కప్ లో ఫైనల్స్ వరకు వెళ్లింది. గత సంవత్సరం జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో సెమీ పైనల్ వరకు వెళ్లింది. కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని గెలవలేకపోయింది. కనీసం 2023 ట్రోఫీ అయినా గెలుస్తుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. టీమిండియాపై క్రికెట్ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. టీమిండియా గెలవాలంటే ఒక ప్లేయర్ మాత్రం టీమ్ లో ఉండాలి. ఆ ప్లేయర్ టీమ్ లో ఉంటే చాలు.. ఖచ్చితంగా మనకు కప్పు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అంటారా?
#image_title
శుభ్ మన్ గిల్ తెలుసు కదా. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శుభ్ మన్ గిల్. అతడు ఎక్కడ ఉంటే అక్కడ టీమిండియా ట్రోఫీ గెలవాల్సిందే. అండర్ 19 ట్రోఫీ, గుజరాత్ టైటాన్స్ జట్టు గెలుపు, ఆసియా కప్ గెలపులో శుభ్ మన్ గిల్ పాత్ర చాలా ముఖ్యమైనది. మనోడు ఎక్కడ ఉంటే అక్కడ గెలుపే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వన్డే వరల్డ్ కప్ లోనూ శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా ఉంటే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్ కప్ లోనూ మనం గెలిచినట్టే అని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం శుభ్ మన్ గల్ జ్వరంతో బాధపడుతున్నాడు. డెంగ్యూ వచ్చిందంటున్నారు. మరి ఆసీస్ తో భారత్ తలపడే తొలి మ్యాచ్ లో గిల్ ఆడుతాడో లేదో మాత్రం తెలియదు.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.