ICC World Cup 2023 : టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలవాలంటే ఈ ప్లేయర్ ఆడాల్సిందే.. అతడు జట్టులో ఉంటే చాలు మనదే ప్రపంచకప్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ICC World Cup 2023 : టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలవాలంటే ఈ ప్లేయర్ ఆడాల్సిందే.. అతడు జట్టులో ఉంటే చాలు మనదే ప్రపంచకప్

 Authored By kranthi | The Telugu News | Updated on :6 October 2023,8:00 pm

ICC World Cup 2023 : మీకు 2011 ఐసీసీ వరల్డ్ కప్ గుర్తుందా? ఆ వరల్డ్ కప్ ను ధోనీ సారథ్యంలో మనమే గెలిచాం. కానీ.. ఆ తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ మనకు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే.. 2013 లో మళ్లీ ధోనీ సారథ్యంలోనే చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంతర్జాతీయ ట్రోఫీలను టీమిండియా గెలుచుకోలేదు. కానీ.. తాజాగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. అది కూడా భారత్ లో ఈసారి వరల్డ్ కప్ జరుగుతోంది. అంటే.. ఈసారి టైటిల్ ఫేవరేట్ భారత్ అన్నమాట. ఈసారి 10 జట్లు.. చివరకు నెగ్గేది ఒక్క జట్టు మాత్రమే. 150 మంది ఆటగాళ్లు ఈసారి వరల్డ్ కప్ లో తమ సత్తా చాటడానికి రెడీ అయ్యారు. అయితే.. టీమిండియా 2013 తర్వాత నాకౌట్ దశ వరకు వెళ్తోంది కానీ.. కప్ మాత్రం గెలవలేకపోతోంది. ఒక్క వన్డే వరల్డ్ కప్ లోనే కాదు.. చాలా టోర్నీలలో టీమిండియా పరిస్థితి ఇదే.

2014 లో టీ20 వరల్డ్ కప్ ను ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయి వచ్చింది టీమిండియా. ఆ తర్వాత 2016 టీ20 వరల్డ్ కప్, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2015, 2019 వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైన్స్ వరకు వెళ్లింది. ఇక టెస్ట్ చాంపియన్ కప్ లో ఫైనల్స్ వరకు వెళ్లింది. గత సంవత్సరం జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో సెమీ పైనల్ వరకు వెళ్లింది. కానీ.. ఇప్పటి వరకు ట్రోఫీని గెలవలేకపోయింది. కనీసం 2023 ట్రోఫీ అయినా గెలుస్తుందా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. టీమిండియాపై క్రికెట్ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. టీమిండియా గెలవాలంటే ఒక ప్లేయర్ మాత్రం టీమ్ లో ఉండాలి. ఆ ప్లేయర్ టీమ్ లో ఉంటే చాలు.. ఖచ్చితంగా మనకు కప్పు వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరు అంటారా?

this player from india lead to trophy in icc world cup 2023

#image_title

ICC World Cup 2023 : అతడే శుభ్ మన్ గిల్

శుభ్ మన్ గిల్ తెలుసు కదా. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శుభ్ మన్ గిల్. అతడు ఎక్కడ ఉంటే అక్కడ టీమిండియా ట్రోఫీ గెలవాల్సిందే. అండర్ 19 ట్రోఫీ, గుజరాత్ టైటాన్స్ జట్టు గెలుపు, ఆసియా కప్ గెలపులో శుభ్ మన్ గిల్ పాత్ర చాలా ముఖ్యమైనది. మనోడు ఎక్కడ ఉంటే అక్కడ గెలుపే అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. వన్డే వరల్డ్ కప్ లోనూ శుభ్ మన్ గిల్ ఓపెనర్ గా ఉంటే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్ కప్ లోనూ మనం గెలిచినట్టే అని అంటున్నారు. అయితే.. ప్రస్తుతం శుభ్ మన్ గల్ జ్వరంతో బాధపడుతున్నాడు. డెంగ్యూ వచ్చిందంటున్నారు. మరి ఆసీస్ తో భారత్ తలపడే తొలి మ్యాచ్ లో గిల్ ఆడుతాడో లేదో మాత్రం తెలియదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది