Vinod Kambli : ఒకప్పటి స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో థానేలోని ఆసుపత్రిలో చేరాడు.ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు కాంబ్లీ, తాజాగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాంబ్లీ 1993-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. ఇటీవల శివాజీ పార్క్‌లో లెజెండరీ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, అతను సచిన్‌ను కలుసుకున్నాడు. వారిద్దరూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.
ఒకప్పుడు నడవడానికే ఇబ్బందులు పడిన ఆయన ఇప్పుడు డ్యాన్స్ సెప్టులతో అదరగొడుతున్నాడు. చికిత్సలో భాగంగా వైద్య బృందం ఆయనతో పాటలకు డ్యాన్స్ చేయిస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కాంబ్లీ చక్‌దే ఇండియా పాటకు సెప్టులు వేయడాన్ని చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తీవ్ర అస్వస్థతతో కాంబ్లీ థానేలోని లోఖండి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. మూత్ర ఇన్‌ఫెక్షన్, ఇతర సమస్యలతో ఆయన ఆస్పత్రిలో చేరగా వైద్య పరీక్షలు నిర్వహించారు.
అతడి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాంబ్లీకి ఫ్యాన్స్ అయిన ఆస్పత్రి ఇన్‌చార్జి భారత మాజీ ఆటగాడికి ఎలాంటి ఫీజులు లేకుండానే చికిత్స చేస్తానని హామీ సైతం ఇచ్చాడు. ప్రస్తుతం కాంబ్లీ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని సోమవారం వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా అతడు ఆసుపత్రి సిబ్బందితో కలిసి హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ నటించిన చక్ దే ఇండియా మూవీలోని పాటపై కాంబ్లీ స్టెప్పులేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కాంబ్లీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Rashmi Gautam : బుల్లితెర మీద జబర్దస్త్ షో యాంకర్ గా అదరగొడుతున్న రష్మి గౌతం Rashmi Gautam అటు…
Hyderabad Water Supply : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన హైదరాబాద్ జలమండలి బోర్డు Hyderabad Water…
Ashika Ranganath : కన్నడ భామ ఆషిక రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఐతే ఆ…
Sreemukhi : తెలుగు బుల్లితెరపై ఓ వెలుగు వెలిగిపోతున్న టాప్ యాంకర్లలో Anchor Sreemukhi శ్రీముఖి ఒకరు. పటాస్ షోలో…
SS Rajamouli : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ట్రైలర్ రిలీజ్…
KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది. కార్ రేస్ నిర్వాహణలో…
Balakrishna Dabidi Dibidi Song : నందమూరి బాలకృష్ణ Balakrishna ఓ పక్క పొలిటికల్ గా తన దూకుడు చూపిస్తూనే…
Allu Arjun : పుష్ప2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు, ఓ మహిళ…
This website uses cookies.