Vinod Kambli : చక్ దే ఇండియా పాట‌కు.. ఆనందంలో చిందులేసిన వినోద్ కాంబ్లి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vinod Kambli : చక్ దే ఇండియా పాట‌కు.. ఆనందంలో చిందులేసిన వినోద్ కాంబ్లి

 Authored By ramu | The Telugu News | Updated on :31 December 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Vinod Kambli : చక్ దే ఇండియా పాట‌కు.. ఆనందంలో చిందులేసిన వినోద్ కాంబ్లి

Vinod Kambli :  ఒక‌ప్ప‌టి స్టార్ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లి ఇటీవ‌ల అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన విష‌యం తెలిసిందే.మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో థానేలోని ఆసుపత్రిలో చేరాడు.ప్రస్తుతం థానెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు కాంబ్లీ, తాజాగా ఆస్పత్రి సిబ్బందితో కలిసి చక్ దే ఇండియా పాటకు వినోద్ కాంబ్లీ స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. కాంబ్లీ 1993-2000 మధ్యకాలంలో భారత్ తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. ఇటీవల శివాజీ పార్క్‌లో లెజెండరీ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, అతను సచిన్‌ను కలుసుకున్నాడు. వారిద్దరూ భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.

Vinod Kambli చక్ దే ఇండియా పాట‌కు ఆనందంలో చిందులేసిన వినోద్ కాంబ్లి

Vinod Kambli : చక్ దే ఇండియా పాట‌కు.. ఆనందంలో చిందులేసిన వినోద్ కాంబ్లి

Vinod Kambli వినోద్ కాంబ్లీ డ్యాన్స్‌

ఒక‌ప్పుడు న‌డ‌వ‌డానికే ఇబ్బందులు ప‌డిన ఆయ‌న ఇప్పుడు డ్యాన్స్ సెప్టుల‌తో అద‌ర‌గొడుతున్నాడు. చికిత్స‌లో భాగంగా వైద్య బృందం ఆయ‌న‌తో పాట‌ల‌కు డ్యాన్స్ చేయిస్తున్నారు.ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో కాంబ్లీ చ‌క్‌దే ఇండియా పాట‌కు సెప్టులు వేయ‌డాన్ని చూడొచ్చు. ఈ వీడియో చూసిన ఆయ‌న అభిమానులు తెగ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల తీవ్ర అస్వ‌స్థ‌త‌తో కాంబ్లీ థానేలోని లోఖండి ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేరాడు. మూత్ర ఇన్‌ఫెక్ష‌న్‌, ఇత‌ర స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఆస్ప‌త్రిలో చేర‌గా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

అత‌డి మెద‌డులో ర‌క్తం గ‌డ్డ క‌ట్టిన‌ట్లు వైద్యులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు చికిత్స అందిస్తున్నారు. కాంబ్లీకి ఫ్యాన్స్ అయిన ఆస్ప‌త్రి ఇన్‌చార్జి భార‌త మాజీ ఆట‌గాడికి ఎలాంటి ఫీజులు లేకుండానే చికిత్స చేస్తాన‌ని హామీ సైతం ఇచ్చాడు. ప్ర‌స్తుతం కాంబ్లీ ఆసుప‌త్రిలో కోలుకుంటున్నాడు. అత‌ని ఆరోగ్య ప‌రిస్థితి మెరుగ‌వుతోంద‌ని సోమ‌వారం వైద్యులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో తాజాగా అత‌డు ఆసుప‌త్రి సిబ్బందితో క‌లిసి హుషారుగా పాట‌లు పాడుతూ డ్యాన్స్ చేశాడు. షారుఖ్ ఖాన్ న‌టించిన చ‌క్ దే ఇండియా మూవీలోని పాట‌పై కాంబ్లీ స్టెప్పులేసిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు కాంబ్లీ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది