Virat Kohli – Anushka Sharma : అద్దె ఇంట్లో ఉంటున్న విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ.. అసలు కారణం ఇదే ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli – Anushka Sharma : అద్దె ఇంట్లో ఉంటున్న విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ.. అసలు కారణం ఇదే ..!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 November 2022,10:20 am

Virat Kohli – Anushka Sharma : స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు నటి , నిర్మాత అనుష్క దంపతుల గురించి మనకు తెలిసిందే . ఇద్దరూ తమ వృత్తిపరంగా వర్క్ చేసుకుంటూ ఫుల్ బిజీ గా ఉంటున్నారు. ఇక కోహ్లీ అయితే ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే సెలబ్రిటీల్లో ఒక్కడు గా ఉన్నాడు. అయితే ఇటీవల వీరిద్దరూ ముంబయిలో జుహూ అనే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ ను అద్దెకు తీసుకున్నారట. దీని కోసం ఏకంగా నెలకు లక్షల్లో అద్దె కడుతున్నట్లు గా తేకుస్తుంది. అయితే అంతటి స్టార్ అయిన వీరు అద్దెకు ఎందుకు ఉండాల్సి వచ్చింది.

అని ప్రతి ఒక్కరి కి అనుమానం వక్తం అవుతుంది. అయితే ఈ దంపతులు దీనికోసం నెలకు ఏకంగా రూ.2.76 లక్షల చొప్పున అద్దె చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది . ముంబై లోని జుహూ అనే ప్రాంతం లో హై టైడ్ అనే బిల్డింగ్‌ లో నాలుగో ఫ్లోర్‌లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్లాట్ నుండి సముద్రం చక్కగా కనిపిస్తుందని, అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది అని , అలాగే సీ వ్యూ కోసమే ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నట్లు సమాచారం . అలాగే ఈ ప్లాట్ లో ఉండటానికి లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ కాపీ ప్రకారం కోహ్లీ ఈ 1650 చదరపు అడుగుల ఫ్లాట్ కు ఒక్కసారే రూ.7.50 లక్షలు డిపాజిట్ చేశాడట.

Virat Kohli and Anushka Sharma staying in a rented house

Virat Kohli and Anushka Sharma staying in a rented house

ఈ డీల్ అక్టోబర్ 17నే పూర్తయినట్లు తెలుస్తుంది . అయితే ఈ అపార్ట్‌మెంట్ మరెవరిదో కాదు, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మాజీ క్రికెటర్ సమర్‌జీత్ సింగ్ గైక్వాడ్‌దే అట. ఇక ఈయన రాజ కుటుంబానికి వారసుడట . ఇంకా ఈ ఫ్లాట్‌ అండర్‌గ్రౌండ్‌లో రెండు కార్లు పార్కింగ్ చేసే ప్లేస్ కూడా ఉందట. అయితే ఇంతకు ముందు విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ జిల్లా అలీబాగ్ లోని జిరాద్ గ్రామంలో 3,350 చదరపు మీటర్ల భూమి ని కొన్నట్లు గా వార్తలు వినిపించాయి. ఇక దీని కోసం కోహ్లీ దాదాపుగా రూ.20 కోట్లు చెల్లించాడట. దీని యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం 2022, సెప్టెంబర్ 1న కోహ్లీ దీనిని తీసుకున్నట్టు తెలుస్తుంది.

Also read

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి