
Virat Kohli Bad Luck in Playing this ball
Virat kohli : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో శ్రీలంక పేలవరీతిలో 109 పరుగులకే కుప్పకూలిపోయింది. మ్యాచ్‌లో రెండో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 86/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక.. అరగంటలోపే మిగిలిన నాలుగు వికెట్లని చేజార్చుకుని ఆలౌటైంది. దాంతో.. శనివారం తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకి ఆలౌటై ఉన్న భారత్ జట్టుకి 143 పరుగుల ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. అశ్విన్, మహ్మద్ షమీ చెరో రెండు, అక్షర్ పటేల్‌కి ఒక వికెట్ దక్కింది.కాగా రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ టెస్టులో మాత్రం ఇండియా బ్యాటింగ్ లైనప్ ను శ్రీలంక బౌలర్లు బాగానే ఇబ్బంది పెట్టారు. మయాంక్ అగర్వాల్ 4 పరుగులు చేసి రనౌట్ కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు… 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో హనుమ విహారి, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం జోడించారు.81 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసిన హనుమ విహారి, జయవిక్రమ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డిక్‌వాలాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 48 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెండో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ చేరారు.48 బంతుల్లో 2 ఫోర్లతో 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ధనంజయ డి సిల్వ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
Virat Kohli Bad Luck in Playing this ball
కాగా ప్రస్తుతం కోహ్లీ ఎల్బీడబ్ల్యూ అయిన తీరు మాత్రం సోషల్ మీడాయాలో బాగా వైరల్ అవుతోంది. అది కచ్చితంగా కోహ్లీ బ్యాడ్ లక్ మాత్రమే అంటున్నారు. టీ బ్రేక్ కు రెండు ఓవర్ల ముందు 28వ ఓవర్ ధనంజయ వేస్తున్నాడు. మొదటి బాల్ డాట్, రెండో బాల్ పంత్ సింగిల్ తీసి విరాట్ కోహ్లీకి స్ట్రైకింగ్ ఇచ్చాడు. ధనంజయ వేసిన షార్ట్ లెంగ్త్ బాల్ ను కోహ్లీ బ్యాక్ ఫుట్ పై డిఫెండ్ చేయబోయాడు. కానీ, ఆ బాల్ ఎక్కువ బౌన్స్ కాకుండా కోహ్లీ యాంకిల్ కు కొద్దిగా పైన తగిలింది. అంపైర్ వెంటనే దానిని ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చేశాడు. అక్కడ ఏం జరిగిందో అసలు ఆ పిచ్ ఎలా ప్రతిస్పందిస్తోందో.. కోహ్లీకి కూడా కాసేపు అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. రివ్యూకు వెళ్లలేదు అలా షాక్ లోనే కోహ్లీ పెవిలియన్ కు వెళ్లిపోయాడు. కేవలం అది కోహ్లీ దురదృష్టమే తప్ప మరేమీ లేదని క్రికెట్ అభిమానులు సమర్థిస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.