Home » News » Westindies Beat England By 30 Runs In T20 World Cup 2026
News

ENG vs WI T20 World Cup 2026 : ఇంగ్లాండ్‌పై వెస్టిండీస్ ఘన విజయం.. రూథర్‌ఫోర్డ్, స్పిన్నర్ల మాయ..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 11, 2026, 11:17 pm
Advertisement

ENG vs WI T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 ICC T20 World Cup 2026 గ్రూప్ సి మ్యాచ్‌లో వెస్టిండీస్ West Indies తన సత్తా చాటింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్ England పై 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ Sherfane Rutherford విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. ఆ తర్వాత బౌలింగ్‌లో స్పిన్నర్లు గూడకేష్ మోటీ, రోస్టన్ చేజ్ ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు.

Advertisement

ENG vs WI T20 World Cup 2026 : ఇంగ్లాండ్‌పై వెస్ట్ ఇండీస్ ఘన విజయం.. రూథర్‌ఫోర్డ్, స్పిన్నర్ల మాయ..!

ENG vs WI T20 World Cup 2026 : రూథర్‌ఫోర్డ్ వీరవిహారం – విండీస్ భారీ స్కోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, సామ్ కర్రన్ ధాటికి ఓపెనర్లు షై హోప్ (0), బ్రాండన్ కింగ్ (1) విఫలమయ్యారు. 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో రోస్టన్ చేజ్ (34), షిమ్రాన్ హెట్మెయర్ (23) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

Advertisement

అయితే, మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది మాత్రం షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్. కేవలం 42 బంతుల్లోనే 7 సిక్సర్లు, 2 ఫోర్లతో 76 పరుగులు (నాటౌట్) చేసి విండీస్ స్కోరును 196/6 కు చేర్చాడు. చివర్లో జేసన్ హోల్డర్ (17 బంతుల్లో 33) కూడా మెరుపులు మెరిపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు.

ENG vs WI T20 World Cup 2026 : ఇంగ్లాండ్ చేజింగ్ – ఉచ్చు బిగించిన స్పిన్నర్లు

197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ మెరుపు వేగంతో మొదలైంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (14 బంతుల్లో 30) జేసన్ హోల్డర్ వేసిన ఒకే ఓవర్‌లో 24 పరుగులు రాబట్టుకున్నాడు. పవర్ ప్లేలో ఇంగ్లాండ్ 67 పరుగులు చేసి మెరుగ్గా నిలిచింది.

Advertisement

కానీ, పవర్ ప్లే ముగియగానే విండీస్ స్పిన్నర్లు రంగ ప్రవేశం చేశారు. గూడకేష్ మోటీ (3/33), రోస్టన్ చేజ్ (2/29), అకీల్ హొసీన్ (1/30) ఇంగ్లాండ్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. జాస్ బట్లర్ (21), కెప్టెన్ హ్యారీ బ్రూక్ విఫలమవడంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

ఒంటరి పోరాటం చేసిన సామ్ కర్రన్

ఒకవైపు వికెట్లు పడుతున్నా.. సామ్ కర్రన్ (30 బంతుల్లో 43 నాటౌట్) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. కానీ అతనికి సహకరించే బ్యాటర్ లేకపోవడంతో ఇంగ్లాండ్ 19 ఓవర్లలోనే 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్ సి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపచుకుంది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (76* పరుగులు).

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి