Bajaj Qute Car : దేశంలో తక్కువ ధరకే బజాజ్ క్యూట్ కారు.. ధరెంతో తెలుసా?
Bajaj Qute Car : నేటి కాలంలో చాలా కుటుంబాలకు కారు కూడా నిత్యావసర వస్తువే. మధ్య తరగది కుటుంబం కారు కలను నెరవేర్చుకునేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తక్కువ ధరలో కారు అనగానే చాలా మందికి సెకండ్ హ్యాండ్ కారే గుర్తొస్తుంది. కానీ సెకండ్ హ్యాండ్ ధరలో కొత్త కారు వస్తే భలే ఉంటుంది కదూ! ఈ జాబితాలోకే వస్తుంది బజాజ్ కంపెనీ క్యూట్ కారు. కమర్షియల్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఈ కారును తీసుకొచ్చారు. అయితే పర్సనల్ వెహికిల్‌గా కూడా ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలో తక్కువ ధర కారుగా దీనికి గుర్తింపు ఉంది. మారుతి ఆల్టో కంటే తక్కువ ధరలో ఈ కారు లభిస్తుంది. క్వాడ్రిసైకిల్ కేటగీరికి చెందిన ఈ కారు దేశపు తొలి ఆటో ట్యాక్సీగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 3.61 లక్షలుగా ఉంది. ఆన్‌రోడ్ వచ్చేసరికి సుమారు రూ. 4 లక్షల వరకు అవుతుంది. ఇక ఈ కారును ఈఎమ్‌ఐతో కూడా సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు రూపాయి డౌన్ పేమెంట్ పెట్టకపోయినా 5 ఏళ్ల ఈఎమ్‌ఐ ద్వారా నెలకు కేవలం రూ. 7 వేలు చెల్లించి సొంతం చేసుకోవచ్చు.
Bajaj Qute Car : దేశంలో తక్కువ ధరకే బజాజ్ క్యూట్ కారు.. ధరెంతో తెలుసా?
ఈ కారును తొలిసారి 2019లో భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కారును యల్లో, బ్లాక్, వైట్ కలర్స్‌లో తీసుకొచ్చింది. అలాగే ఎల్‌పీజీ, సీఎన్‌జీ వేరియంట్స్‌లో ఈ కారును రూపొందించారు. ఈ కారులో 216.6 సీసీతో కూడిన లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. 20.6 లీటర్లు ఈ కారు ఫ్యూయల్ కెపాసిటీ. ఈ కారు పరిమాణంలో చాలా చిన్నగా ఉండడంతో ఎంతటి ట్రాఫిక్‌లో అయినా దూసుకెళ్లొచ్చు. ఆటో గేర్, ఏసీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ఉంటుంది.
LPGపై నడుస్తున్నప్పుడు గరిష్ట పవర్ అవుట్‌పుట్ 12.44 పిఎస్. CNG మోడ్‌లో పవర్ అవుట్‌పుట్ 11 పిఎస్ అందిస్తుంది. ఈ ఈ కారు గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ బుజ్జి కారులో ఎంచక్కా 4గురు ప్రయాణించవచ్చు. డిజిట్ డ్యాష్ బోర్డ్, 12వీ ఛార్జింగ్ సాకెట్‌ను అందించారు. ఈ కారు బరువు 450 కిలోలు ఉంటుంది. అయితే హైవేలపై వేగంగా వెళ్లే వారికి ఇది సెట్ అవ్వదు. ఈ కారులో గేర్ లివర్, స్పీడోమీటర్ వాటి ఫీచర్లు ఉన్నాయి. కొత్తగా ఇందులో డాష్ బోర్డు డిజైను అమర్చారు. స్టీరింగ్ వీల్ వెనకాల స్పీడోమీటర్ కన్సోను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సెంటర్ కన్సోల్ సెంట్రల్ ని మౌంటెడ్ ఏసీవెంట్ వంటివి ఉన్నాయి. యాసైటీ కి అప్డేట్ తో పాటు రీడిజైన్ బంపర్ నైట్ సెటప్ ను చేశారు. ఇలా కారు మొత్తం కొత్త రకంగా కనిపించి ఆకట్టుకుంటుంది.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.