Flipkart : ప్రస్తుతం స్మార్ట్ టీవీల హంగామా నడుస్తుంది. దీంతో మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ టీవీలు వస్తున్నాయి. ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నుంచి బడ్జెట్ లో 43 ఇంచుల స్మార్ట్ టీవీ వచ్చింది. ఇన్ఫినిక్స్ 43వై1 స్మార్ట్ టీవీ విడుదల అయింది. ఈ స్మార్ట్ టీవీ 14 వేల లోపు ధరకే ఫుల్ హెచ్డి రెజల్యూషన్ డిస్ప్లే తో వచ్చింది. డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే స్పీకర్లు ఈ స్మార్ట్ టీవీలో ఉంటాయి. డిస్ప్లే చుట్టు అంచులు తక్కువగా ఉండే బెజిల్ లెస్ డిజైన్ తో ఈ టీవీ చూడడానికి సూపర్ గానే ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓ ఎస్ తో కాకుండా ఈటీవీ లైనక్స్ ఓఎస్ తో వస్తుంది.
ఇన్ఫినిక్స్ 43 వై1 1920×1080 పిక్సెల్ రెజల్యూషన్ ఉండే 43 ఇంచుల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంది. 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్,300 నెట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ ఉంటాయి. ఐ కేర్ మోడ్ ఫీచర్ కూడా ఈ టీవీలో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఇన్ఫినిక్స్ ఆపరేటింగ్ సిస్టం రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ టీవీ ఓ ఎస్ తో వస్తుందని అంచనా. ఇన్ఫినిక్స్ మాత్రం మాక్స్ తో రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో యూట్యూబ్ జీ ఫైవ్ హంగామా తో పాటు మరిన్ని ఓటిపి ప్లాట్ ఫామ్ లకు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. అయితే నెట్ ఫ్లిక్స్ సపోర్ట్ ఉండదు. నాలుగు కోర్స్ ఉండే సిపియు, మాలి జీ31 జీపీయూ ఈ టీవీలో ఉన్నాయి. 512జీబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ టీవీ వస్తుంది.
20 వాట్ల వరకు సౌండ్ అవుట్ పుట్ ఇచ్చే రెండు స్పీకర్లు ఇన్ఫినిక్స్ 43 వై1 స్మార్ట్ టీవీలో ఉన్నాయి. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. సినిమాటిక్ ఆడిటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వైఫై రెండు హెచ్ డిఎంఐ పోర్టులు, రెండు యుఎస్బి పోర్టులు, ఓ హెడ్ ఫోన్ జాక్, ఎథర్ నెట్ పోర్ట్ ఈ టీవీ కి కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. ఇన్ఫినిక్స్ 43 వై1 స్మార్ట్ టీవీ ధర రూ.13,999 గా ఉంది. ఈ కామర్స్ సైట్ అయిన ఫ్లిప్ కార్ట్ లో ఈ టీవీ లిస్టు అయింది. అతి త్వరలో ఈ టీవీ సేల్ కు వస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. అయితే కచ్చితంగా తారీకు చెప్పలేదు. నాలుగు రోజుల్లో ఈ టీవీ సేల్ కు వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు కార్డ్ ఆఫర్లో ఈ స్మార్ట్ టీవీలు అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.