
SBI ఖాతాదారులకి శుభవార్త... ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1 లక్ష రుణం..!
SBI : ప్రతి ఒక్కరికి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చిందని చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఖాతాని కలిగి ఉంటారో వారికి ఇది సువర్ణావకాశం. ఎందుకంటే ఇప్పుడు SBI ఖాత ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా అతి తక్కువ వడ్డీరేట్లకే మీరు రూ. 1 లక్ష రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. దీనికోసం మీరు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీంతో రుణ ప్రక్రియ గతంలో కంటే చాలా సులభంగా పొందవచ్చు. మరి ఈ రుణాన్ని ఎలా పొందాలి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీని సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
SBI ఖాతాదారులకి శుభవార్త… ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1 లక్ష రుణం..!
e-ముద్ర లోన్ అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజనలో ఒకటిగా పేర్కొనబడింది. ఇక ఈ పథకం ద్వారా సులభమైన రుణ దరఖాస్తు ప్రక్రియతో ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం అర్హత కలిగిన ఖాతాదారులకు రూ. 1 లక్ష రూపాయల వరకు రుణాలు అందించడం జరుగుతుంది. తద్వారా వారు వారి వ్యాపారాలను స్థాపించడానికి లేదా విస్తరించడానికి ఈ డబ్బు సహాయపడుతుంది. అంతేకాక ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రుణం పొందడానికి మీరు బ్యాంకుకు ఎలాంటి ఉచికత్తు లేదా భద్రత పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాక తక్కువ వడ్డీరేట్ల తో ఈ రుణాలను పొందవచ్చు……
ఈ రుణాల్ని పొందాలి అనుకునేవారు కచ్చితంగా కింది అర్హతలను కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ రుణాన్ని పొందగలరు.
ఈ పథకం ద్వారా మీరు రుణం పొందాలి అనుకుంటే ముందుగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 6 నేలలపాటు యాక్టివ్ గా ఉన్నటువంటి ఖాతాను కలిగి ఉండాలి.
SBI మీరు చట్టబద్ధమైన వ్యాపారం చేస్తున్న వారై ఉండాలి.
ఇక దీనిలో సాంప్రదాయ రుణాల మాదిరిగా కాకుండా ఎలాంటి భద్రత తాకట్టు లేకుండా మీరు రుణం పొందవచ్చు. కావున ఆస్తులు లేని చిన్న వ్యాపారస్తులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ పథకం ద్వారా మీరు మొత్తం లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు.అలాగే తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించవచ్చు . అలాగే మీరు రుణాన్ని వేగంగా తిరిగి చెల్లించాలి అనుకుంటే మీకు కావాల్సిన కాల పరిమితిని ఎంచుకోవచ్చు. ఈ సందర్భంలో EMI మొత్తం పెరుగుతుందని గుర్తించగలరు.ఇక 50వేల వరకు రుణాలను తీసుకోవాలనుకునేవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 50 వేలకు మించి రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా తదుపరి ప్రాసెసింగ్ కోసం బ్యాంకును సందర్శించాలి.
e ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కచ్చితంగా కొన్ని ముఖ్యమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. అవేంటంటే
SBI ఆధార్ కార్డు
వ్యాపారం రుజువు
బ్యాంకు ఖాతా వివరాలు
కమ్యూనిటీ వివరాలు
గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్స్
దీనికోసం ముందుగా మీరు SBI e ముద్ర పోర్టల్ సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం దానిలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే “బటన్” పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన సూచనలను అనుసరించి జాగ్రత్తగా చదివి “సరే” బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత భాగంలో అడిగిన ప్రతి వివరాలను పూరించి ,అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.