SBI ఖాతాదారులకి శుభవార్త… ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1 లక్ష రుణం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI ఖాతాదారులకి శుభవార్త… ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1 లక్ష రుణం..!

 Authored By ramu | The Telugu News | Updated on :14 February 2025,4:00 pm

ప్రధానాంశాలు:

  •  SBI ఖాతాదారులకి శుభవార్త... ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1 లక్ష రుణం..!

SBI  : ప్రతి ఒక్కరికి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చిందని చెప్పాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరైతే ఖాతాని కలిగి ఉంటారో వారికి ఇది సువర్ణావకాశం. ఎందుకంటే ఇప్పుడు SBI ఖాత ద్వారా ఎలాంటి పూచికత్తు లేకుండా అతి తక్కువ వడ్డీరేట్లకే మీరు రూ. 1 లక్ష రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. దీనికోసం మీరు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. దీంతో రుణ ప్రక్రియ గతంలో కంటే చాలా సులభంగా పొందవచ్చు. మరి ఈ రుణాన్ని ఎలా పొందాలి దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? దీని సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

SBI ఖాతాదారులకి శుభవార్త ఎలాంటి తాకట్టు లేకుండా రూ1 లక్ష రుణం

SBI ఖాతాదారులకి శుభవార్త… ఎలాంటి తాకట్టు లేకుండా రూ.1 లక్ష రుణం..!

SBI e-ముద్ర లోన్ …

e-ముద్ర లోన్ అనేది ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజనలో ఒకటిగా పేర్కొనబడింది. ఇక ఈ పథకం ద్వారా సులభమైన రుణ దరఖాస్తు ప్రక్రియతో ఆర్థిక సాయం పొందవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం అర్హత కలిగిన ఖాతాదారులకు రూ. 1 లక్ష రూపాయల వరకు రుణాలు అందించడం జరుగుతుంది. తద్వారా వారు వారి వ్యాపారాలను స్థాపించడానికి లేదా విస్తరించడానికి ఈ డబ్బు సహాయపడుతుంది. అంతేకాక ఈ పథకం ద్వారా రుణం తీసుకున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రుణం పొందడానికి మీరు బ్యాంకుకు ఎలాంటి ఉచికత్తు లేదా భద్రత పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాక తక్కువ వడ్డీరేట్ల తో ఈ రుణాలను పొందవచ్చు……

SBI  హర్హతలు…

ఈ రుణాల్ని పొందాలి అనుకునేవారు కచ్చితంగా కింది అర్హతలను కలిగి ఉండాలి. అప్పుడే మీరు ఈ రుణాన్ని పొందగలరు.

SBI  ఎస్బిఐ ఖాతా..

ఈ పథకం ద్వారా మీరు రుణం పొందాలి అనుకుంటే ముందుగా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 6 నేలలపాటు యాక్టివ్ గా ఉన్నటువంటి ఖాతాను కలిగి ఉండాలి.
SBI  మీరు చట్టబద్ధమైన వ్యాపారం చేస్తున్న వారై ఉండాలి.

ఇక దీనిలో సాంప్రదాయ రుణాల మాదిరిగా కాకుండా ఎలాంటి భద్రత తాకట్టు లేకుండా మీరు రుణం పొందవచ్చు. కావున ఆస్తులు లేని చిన్న వ్యాపారస్తులకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక ఈ పథకం ద్వారా మీరు మొత్తం లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు.అలాగే తీసుకున్న రుణాన్ని 5 సంవత్సరాల వరకు తిరిగి చెల్లించవచ్చు . అలాగే మీరు రుణాన్ని వేగంగా తిరిగి చెల్లించాలి అనుకుంటే మీకు కావాల్సిన కాల పరిమితిని ఎంచుకోవచ్చు. ఈ సందర్భంలో EMI మొత్తం పెరుగుతుందని గుర్తించగలరు.ఇక 50వేల వరకు రుణాలను తీసుకోవాలనుకునేవారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 50 వేలకు మించి రుణం తీసుకోవాలంటే ఖచ్చితంగా తదుపరి ప్రాసెసింగ్ కోసం బ్యాంకును సందర్శించాలి.

SBI  కావాల్సిన పత్రాలు…

e ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కచ్చితంగా కొన్ని ముఖ్యమైన పత్రాలను అందించాల్సి ఉంటుంది. అవేంటంటే

SBI  ఆధార్ కార్డు

వ్యాపారం రుజువు

బ్యాంకు ఖాతా వివరాలు

కమ్యూనిటీ వివరాలు

గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్ మెంట్స్

SBI  ఆన్ లైన్ దరఖాస్తు..

దీనికోసం ముందుగా మీరు SBI e ముద్ర పోర్టల్ సందర్శించాల్సి ఉంటుంది. అనంతరం దానిలో ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే “బటన్” పై క్లిక్ చేయాలి. తర్వాత వచ్చిన సూచనలను అనుసరించి జాగ్రత్తగా చదివి “సరే” బటన్ పై క్లిక్ చేయాలి. తర్వాత భాగంలో అడిగిన ప్రతి వివరాలను పూరించి ,అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది