RBI : మార్కెట్‌లోకి నూతన రూ.50 నోట్లు.. ఇక నుంచి పాత నోట్లు..?
ప్రధానాంశాలు:
RBI : మార్కెట్‌లోకి నూతన రూ.50 నోట్లు
RBI : రూ.50 నోటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా reserve bank of india కొత్త సమాచారాన్ని పంచుకుంది. దేశ కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ RBI త్వరలో కొత్త రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లపై కొత్త ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా Sanjay Malhotra సంతకంతో కూడిన రూ.50 నోట్లను విడుదల చేయనుంది. డిసెంబర్ 2024లో శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా నియమితులయ్యారు.

RBI : మార్కెట్‌లోకి నూతన రూ.50 నోట్లు.. ఇక నుంచి పాత నోట్లు..?
“ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ. 50 నోట్ల మాదిరిగానే ఉంటుంది” అని సెంట్రల్ బ్యాంక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అన్ని రూ. 50 డినామినేషన్ నోట్లు Rs 50 denomination banknotes చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.
RBI సంజయ్ మల్హోత్రా ఎవరు ?
2022 సంవత్సరంలోనే సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం RBI గవర్నర్ పదవికి నామినేట్ చేసిందని మీకు తెలుసా? ఇప్పటివరకు ఆయన ఆర్థిక సేవల విభాగం (DFS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు. సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన సీనియర్ అధికారి. నవంబర్ 2020లో, ఆయన REC ఛైర్మన్ మరియు MD గా నియమితులయ్యారు. ఆయన కొంతకాలం ఇంధన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.